స్వచ్ఛ సుందర చల్లపల్లి – 30-12-2017

55a00881-cabf-4e04-a1dd-484635879fa7

శివరాంపురంలో పండుగ వాతావరణంలో జరిగిన స్వచ్ఛ సేవ

స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో 1145* వ నాడు 42 మంది ఉదయం 4:19 గంటల నుండి 6:30 గంటల వరకు శివరాంపురంలో పిచ్చిమొక్కలు, చెత్త తొలగించారు. అంతే కాకుండా రోడ్డుపక్కన ఎత్తుపల్లాలు సరిచేయ్యటం, గోతులు పూడ్వడం, ఊడ్వడం, కళ్ళాపు చల్లటం చేశారు.

శివరాంపురం కార్యకర్త ‘బి.డి.ఆర్. ప్రసాద్’ గారు ‘స్వచ్ఛ చల్లపల్లి’ కోసం 4 నక్కులను ఇవ్వడం జరిగింది.

“పిడికిటి హరిప్రసాద్ గారు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.

రేపు ఉదయం 4-30 గంటలకు చల్లపల్లి సెంటర్ లో కలుసుకుందాం.
కోలాటం, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ఆనంద ఆదివారం కార్యక్రమాలు ఉంటాయి.

రేపు ‘యడ్ల రాము’ గారు ‘మనకోసం మనం’ ట్రస్ట్ పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులకు యూనిఫాం ఇచ్చే కార్యక్రమం ఉంది. అందుకోసం రేపటి కార్యక్రమం అనంతరం యడ్ల రాము గారి ఇంటి వద్దకు చేరుకోవాలి.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ
మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి
శనివారము – 30.12.2017

స్వచ్ఛ సైన్యం జైత్రయాత్రలు

నీరసించిన సమాజ స్పృహ – నిద్ర మునిగిన జనం జాగృతి
దారి తప్పిన పారిశుద్ధ్యం – దైన్య స్థితిలో ప్రజారోగ్యం
చక్కదిద్దగ అన్నిటికి మందొక్కటే పరిసరం శుభ్రత
చల్లపల్లి స్వచ్ఛసైన్యం జైత్రయాత్రల అంతరార్థం!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

9fc1ea7e-c3dc-4e79-88b8-354f7dd5699e 72a279af-a5bc-4492-9d2f-52769ce277e6 77d95b45-4329-449f-9c1b-9c82a0255c9d 94729904-6b89-4adb-8a45-294abb642629 a79584e6-1d78-4c4a-8e88-876b344a114f aa7f6aba-f5af-40b3-a934-9ad7efa1539e

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *