స్వచ్ఛ సుందర చల్లపల్లి – 01-01-2018

1a84c9d9-f754-476e-8750-c9fb0d50365b

నూతన సంవత్సరంలో స్వచ్ఛ సైనికుల ఉత్సాహవంతమైన సేవలు

స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో 1147* వ నాడు 60 మంది ఉదయం 4:17 గంటల నుండి 6:30 గంటల వరకు డంపింగ్ యార్డు వద్ద విజయవాడ రోడ్డు కిరువైపులా పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు.

MPP లంకబాబు గారు, ZPTC కృష్ణ కుమారి గారు, సర్పంచ్ పద్మావతి గారు, పంచాయతీ EO ప్రసాద్ గారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వారి సేవలను అభినందించారు. కృష్ణ కుమారి గారు, పద్మావతి గారు నూతన సంవత్సరం సందర్భంగా తీసుకు వచ్చిన కేకును లంకబాబు గారు కట్ చేశారు. కేకు, స్వీట్, హాట్ కార్యకర్తలందరికీ పంచిపెట్టారు.

పండుగ వాతావరణంలో జరిగిన నేటి కార్యక్రమం తరువాత LIC బాషా గారు 10,000/- రూపాయల చెక్కును, శ్రీ సత్యసాయి ధ్యానమండలి వారు 2,018/- రూపాయలు, రెండు మొక్కలు, దేసు మాధురి గారి కుటుంబసభ్యులు 500/- రూపాయలు, ప్రాతూరి శాస్త్రి గారు ప్రతి నెలా ఇచ్చే 5,000/- రూపాయల చెక్కును, ఖాన్ గారు 100/- రూపాయలు “మనకోసం మనం” ట్రస్ట్ కి విరాళంగా ఇచ్చారు. వీరందరికీ స్వచ్ఛ కార్యకర్తలందరి తరఫున ధన్యవాదములు.

గత మూడు సంవత్సరంలలో కార్యకర్తల శ్రమతో, ప్రజా ప్రతినిధుల, అధికారుల సహకారంతో చల్లపల్లి ఎంతో అభివృద్ధి చెందడమే కాకుండా పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీకి మరిన్ని మంచి మార్పులు చూస్తామని కార్యకర్తలు ఆశిస్తున్నారు.

“కట్టా పద్మావతి గారు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

రేపు ఉదయం 6-00 గంటలకు చల్లపల్లి సెంటర్ లో కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ
మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి
సోమవారము – 01.01.2018

స్వచ్ఛ సైన్యం జైత్రయాత్రలు

వివాదాలకు – ఘర్షణలకూ – వితండాలకు తావులేనిది
ఎవరు నవ్వినా – ఎవరు మెచ్చిన – వీసమైనా బాధపడనిది
ఉన్న ఊరిని సమగ్రంగా ఉన్నతంగా మలచుచున్నది
చల్లపల్లి స్వచ్ఛసైన్యం జైత్రయాత్రగ సాగుచున్నది!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 3b0bd103-fb68-4205-bc62-7250ac1380b0 3c3690a4-11b8-4c2e-afff-f959d92e35c7 11ea316a-d0f3-4117-96f5-d0a55ab9baa2 574b5db1-17e4-4370-999d-eca52fe6791b 65b894af-5bc8-41f5-b444-a8c2cf3c8818 75c721da-3180-4c38-9ba1-f70987026cb9 18e2ffc4-526a-4f1a-9a7c-d22f99842aa4 63853e55-599d-4a24-85fb-60ce62bb90a3 375671a0-22bf-4efd-a248-51bc8b91ec83

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *