స్వచ్ఛ సుందర చల్లపల్లి – 02-01-2018

25662d87-6633-4907-979e-f0253e67ad25

అలసట ఎరుగని స్వచ్ఛ సైనికుల నిర్విరామ శ్రమ

స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో 1148* వ నాడు 40 మంది స్వచ్ఛ కార్యకర్తలు ఉదయం 5:42 గంటల నుండి 7:00 గంటల వరకు చల్లపల్లి సెంటర్ లో రోడ్డుపై ఉన్న దుమ్మును, రోడ్డు ప్రక్కల చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. రోడ్డుపై ఉన్న ఎత్తుపల్లాలను సరిచేసి గోతులను రాళ్ళముక్కలతో పూడ్చారు.

“వేమూరి అర్జునరావు మాష్టారు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.

SRYSP కళాశాల ప్రిన్సిపాల్ తగిరిశ సాంబశివ రావు గారు “మనకోసం మనం” ట్రస్ట్ కి ప్రతినెలా ఇచ్చే 500/- రూపాయల విరాళం అందించారు. వారికి ధన్యవాదములు.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

రేపు ఉదయం 4-30 గంటలకు శివరాంపురంలో కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ
మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి
మంగళవారము – 02.01.2018

స్వచ్ఛ సైన్యం జైత్రయాత్రలు

ఎవరి కోసం – ఎంత దూరం స్వచ్ఛసేవల ఈ ప్రయాణం?
అన్ని వార్డుల – అన్నిమూలల స్వచ్ఛ శుభ్రత కలుగు దాకా,
గ్రామప్రజలకు స్వచ్ఛతా సంకల్ప దీక్ష జనించు దాకా
స్వచ్ఛ చల్లపల్లి స్వచ్ఛ సైన్యం జైత్రయాత్రలు సాగు ముందుకు!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 0c2ebcde-353b-41d4-8add-3ca54638805d 342221d4-e9d0-4fa3-8d08-0f25b84b092b ae19a4ff-97dc-4c6a-af2e-49f12397b79f 3 4

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *