స్వచ్ఛ సుందర చల్లపల్లి – 03-01-2018

30302fa4-a644-4ebf-adad-44c44aee9c0e

స్వచ్ఛ సైనికుల శ్రమతో పునీతమౌతున్న చల్లపల్లి

స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో 1149* వ నాడు 40 మంది స్వచ్ఛ కార్యకర్తలు ఉదయం 4-17 గంటల నుండి 6-30 గంటల వరకు శివరాంపురంలో రోడ్డుపక్కల పిచ్చిమొక్కలు, ముళ్ళకంప, తుక్కు తొలగించి శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు. రోడ్డుపై ఉన్న గుంటలను రాళ్ళముక్కలతో పూడ్చారు.

“తుమ్మల జనార్ధన రావు గారు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

రేపు ఉదయం 4-30 గంటలకు శివరాంపురం చెరువు వద్ద కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ
మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి
బుధవారము – 03.01.2018

స్వచ్ఛ సైన్యం జైత్రయాత్రలు

వెర్రి వినిమయ దుష్ట సంస్కృతి విషఫలం గమనించినప్పుడు
మోహినీ భస్మాసురుల కథ మూలతత్త్వం తెలిసి వచ్చును
వ్యష్టి నుండి సమిష్టి శ్రేయం వచ్చు మార్గం చాటి చెప్పుచు
చల్లపల్లి స్వచ్ఛ సుందర జైత్రయాత్రలు సాగుచున్నవి!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 2edbe307-0c71-4de5-b27e-23620158884e 9d3d72c3-d35b-4888-9e14-d5470128af8e c0299387-d364-452e-ae21-a95d97c7076d fbbd7a38-5ea9-4179-aaa2-ff177e915ccb

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *