స్వచ్ఛ సుందర చల్లపల్లి – 12-03-2018

67fe7bb1-dc60-4793-b880-1c404d1e5474

వెలకట్టలేని స్వచ్ఛ సైనికుల సేవలు @ 1217* రోజులు

ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో 30 మంది కార్యకర్తలు ఉదయం 4-19 గంటల నుండి 6-30 గంటల వరకు బండ్రేవుకోడు గట్టును ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి పెదకళ్ళేపల్లి రోడ్డు వరకు శుభ్రం చేశారు.

కొంతమంది కార్యకర్తలు సన్ ఫ్లవర్ కాలనీ నుండి బండ్రేవుకోడుకు వెళ్ళు డ్రెయిన్ ను శుభ్రం చేశారు.

మరికొంతమంది కార్యకర్తలు డ్రెయిన్ లో తీసి ఎండిన మట్టిని రోడ్డుపక్కన ఉన్న పల్లాలలో వేసి సర్దారు.

“వక్కలగడ్డ వెంకటేశ్వర రావు గారు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’, ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 176*వ రోజుకు చేరుకున్నాయి.

రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు మునసబు గారి బజారులో ఇస్లాంనగర్ వద్ద కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సోమవారం – 12-03-2018

ఒక అనితరసాధ్య దీక్ష
విశేషమై – సశేషమై వెలిగే స్వచ్ఛోద్యమం
వినీతమై – పునీతమై విరియు త్యాగ పరిమళం
సుశీలమై – విశాలమై స్వచ్ఛభటుల భవ్యదీప్తి
వినూత్నమై – ప్రదీప్తమై వెలయు చల్లపల్లి కీర్తి!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 1533ac58-e26f-4d47-b022-25a7f7c5537f
85752d67-85ce-4d9e-988c-ebac0f68134b
977061e1-7f77-4a98-9b45-61a9879b5f50
d39bc3f8-b838-422f-9574-b27d1c7533c5

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *