స్వచ్ఛ సుందర చల్లపల్లి – 13-03-2018

IMG_1508
1218* రోజుల గ్రామ సేవ
 
ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో 35 మంది కార్యకర్తలు ఉదయం 4-11 గంటల నుండి 6-30 గంటల వరకు మునసబుగారి బజారు, రాజ్యలక్ష్మి గారి బజారు, కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు వెనుక ప్రాంతంలోను పిచ్చిమొక్కలను నరికి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు.
 
రాజ్యలక్ష్మి గారి బజారు మొదలులో రెండు సంవత్సరముల నుండి ఉన్న ఒక చెట్టు మానును పక్కకు తొలగించి ఆ ప్రాంతాన్నంతా సరిచేసి బిళ్ళగన్నేరు మొక్కలు నాటారు.
 
అదే బజారు లోని ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా అడ్డదిడ్డంగా పడి ఉన్న సిమెంట్ బల్లలను పక్కకు జరిపి ఆ ప్రాంతమంతా శుభ్రం చేశారు.
 
కొంతమంది కార్యకర్తలు సన్ ఫ్లవర్ కాలనీ నుండి బండ్రేవుకోడులో కలిసే డ్రెయిన్ ను శుభ్రం చేశారు. నేటితో ఈ డ్రెయిన్ పని పూర్తి అయింది. డ్రెయిన్ లో పని చేసిన కార్యకర్తలందరిపై రామారావు మాష్టారు ఒక పద్యాన్ని రాసి చదివారు.
 
మరికొంతమంది కార్యకర్తలు కొద్దిరోజుల క్రితం డ్రెయిన్ నుండి తీసిన మట్టిని ఎత్తి రోడ్లపక్కన పల్లాలలో వేశారు.
 
“నల్లూరి రామారావు గారు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’, ‘స్వచ్ఛ సుందర ఆరోగ్య చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
 
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 177*వ రోజుకు చేరుకున్నాయి.
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు వద్ద కలుసుకుందాం.
 
నిన్న సాయంత్రం కొంతమంది కార్యకర్తలు 2,3,4 వార్డులలోని ప్రజలకు చల్లపల్లిలో పారిశుద్ధ్య నిర్వహణను పంచాయతీకి అప్పగించటంపై అవగాహన కల్పించారు.
 
ఈరోజు ఉదయం 10-00 గంటలకు కోమలా నగర్ లో కౌన్సిలింగ్ కి బయలుదేరుతున్నారు. వీలున్న కార్యకర్తలు శాస్త్రి గారి ఇంటి వద్దకు వచ్చి పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
మంగళవారం – 13-03-2018
 
అవి శాశ్వత ముద్రలు
 
కనకదుర్గో – ధనలక్ష్మో – అన్నపూర్ణో – భారతో
చల్లపల్లి స్వస్థతకై సాగించే సేవలు
సుందరీకరణ కోసం చూపుతున్న తెగువలు
స్వగ్రామం భవితవ్యపు శాశ్వతమగు ముద్రలు!
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
IMG_1466
IMG_1481
IMG_1494
IMG_1500

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *