స్వచ్ఛ సుందర చల్లపల్లి – 14-03-2018

2506f583-26b7-4c70-b169-8c5b35ccdcbb
1219* రోజుల స్వచ్ఛ సుందర సేవ
 
ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో 35 మంది కార్యకర్తలు ఉదయం 4-12 గంటల నుండి 6-30 గంటల వరకు డా.రాజ్యలక్ష్మి గారి బజారులో రోడ్డు కిరువైపులా ఎత్తుపల్లాలు సరిచేశారు. ఖాళీస్థలాలలో పిచ్చిమొక్కలు తొలగించారు. బిళ్ళగన్నేరు మొక్కలను కూడా నాటారు.
 
కొంతమంది కార్యకర్తలు రజకబజారు చెరువు గట్టుపై ఉన్న పిచ్చిమొక్కలను నరికి శుభ్రం చేశారు.
 
మరికొంతమంది డ్రెయిన్ ని శుభ్రం చేశారు.
 
ఈనాటి కార్యక్రమంలో డా. రాజ్యలక్ష్మి గారు పాల్గొనటం విశేషం.
 
పురిటిగడ్డ వాస్తవ్యులు పరుచూరి జెస్ పాల్ గారు “మనకోసం మనం” ట్రస్ట్ కి 1,000/- రూపాయలు, కార్యకర్తలకు నాప్ కీన్స్, టార్చ్ లైట్స్ ను VRO తూము వెంకటేశ్వర రావు గారి ద్వారా విరాళంగా అందించారు. వారికి స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.
 
డా. రాజ్యలక్ష్మి గారి బజారులో షాదీఖానా పూర్తి అయి చాలా అందంగా ఉంది.
 
విజయ కాన్వెంట్ లో 6వ తరగతి చదువుతున్న “వర్ధని” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’, ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
 
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 178*వ రోజుకు చేరుకున్నాయి.
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు వద్ద కలుసుకుందాం.
 
నిన్న ఉదయం కొంతమంది కార్యకర్తలు కోమలానగర్ ప్రజలకు, సాయంత్రం మరికొన్ని బజార్ల వారికి చల్లపల్లిలో పారిశుద్ధ్య నిర్వహణను పంచాయతీకి అప్పగించటంపై అవగాహన కల్పించారు.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
బుధవారం – 14-03-2018
 
ఎవరిదొ ఈ చల్లపల్లి!
 
దున్నువాళ్ళవె భూములైతే – ఏలువాళ్ళదె రాజ్యమైతే
హక్కులెక్కువ అడగకుండా – బాధ్యతలె తలకెత్తుకుంటూ
మాతృగ్రామం మూలమూలలు మలినరహితం చేయువారిదె
స్వచ్ఛ సుందర చల్లపల్లి స్వచ్ఛ సైనిక పటాలానిదె!
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
0e7a6a18-2dd5-46e3-a536-ecd0d0ffd517
1b890222-0515-47f6-a4a4-0ed37a600cb6
c1089db6-f135-46a4-8c96-82d362e18921

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *