స్వచ్ఛ సుందర చల్లపల్లి – 15-03-2018

36359717-cd6c-4daf-8879-26cabed1676b

1220* రోజుల స్వచ్ఛ సుందర సేవ

ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో 46 మంది కార్యకర్తలు ఉదయం 4-18 గంటల నుండి 6-30 గంటల వరకు గౌడపాలెం చెరువు చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేశారు. సిమెంట్ రోడ్డు మీద ఉన్న ఇసుక, మట్టిని తీసి పల్లాలలో సర్దారు.

పూడిపోయి ఉన్న రెండు డ్రైనేజీ కాల్వలను పూడిక తీసి మురుగు పారేటట్లు చేశారు.

కొంతమంది కార్యకర్తలు డా. భగత్ సింగ్ గారి ఇంటి ఎదురుగా ఉన్న రద్దును తీసుకువెళ్లి MDO ఆఫీస్ బయట పల్లాలలో వేసి సర్దారు.

డా. రాజ్యలక్ష్మి గారు మన స్వచ్ఛ కార్యక్రమంలో ఈరోజు కూడా పాల్గొన్నారు.

మిరియాల నాంచారయ్య గారి పెదకర్మ ఈరోజు డా. రాజ్యలక్ష్మి గారి బజారులో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛ కార్యకర్తలందరూ రావలసిందిగా వారి కుమార్తె పిలవటం జరిగింది.

“మాలెంపాటి అంజయ్య గారు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’, ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 179*వ రోజుకు చేరుకున్నాయి.

రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు వద్ద కలుసుకుందాం.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
గురువారం – 15-03-2018

తగినదేదో – తగనిదేదో!

క్రూరమైన – ఘోరమైన – హృదయ విదారకమైన
ప్రజారోగ్యభంగమైన – పర్యావరణ ధ్వంసమైన
ప్రస్తుత ప్రపంచరీతి పరిహరింప దగనిదా?
స్వచ్ఛ చల్లపల్లి నీతి పాటింపగదగినదా?

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 8a1efcaf-ae06-4871-b4e0-0b47b6b73642
27118069-00ce-40fb-8a45-f51c227b459b
IMG_1652
IMG_1601

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *