స్వచ్ఛ సుందర చల్లపల్లి – 03-04-2018

73e306e6-3f2f-4c05-a494-9a78a32f9dfe
స్వచ్ఛ సేవ @ 1239* రోజులు
 
ఈరోజు ST కాలనీలో ప్రధాన రహదారి వద్ద స్వచ్ఛ కార్యక్రమం జరిగింది. 32 మంది స్వచ్ఛ కార్యకర్తలు ఉదయం 4-15 గంటల నుండి 6-15 గంటల వరకు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రోడ్డుకిరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించారు. రోడ్డుపైన, రోడ్డు పక్కన ఉన్న డ్రెయినేజి మట్టిని తీసి పల్లాలలో వేసి సరిచేశారు.
 
రవీంద్ర భారతి స్కూల్ లో 3వ తరగతి చదువుతున్న హర్షిత అనే పాప నేటి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంది.
 
నిన్న ఉదయం విద్యుత్ శాఖవారు పద్మావతి హాస్పిటల్ రోడ్డులో HT లైన్ కింద ఉన్న వృక్షాలకు Pruning చేశారు. దాదాపు ఒక ట్రాక్టర్ ట్రక్కుకు సరిపడా ఉన్న కొమ్మలను కార్యకర్తలు ట్రాక్టర్ తో డంపింగ్ యార్డుకి తరలించారు.
 
నిన్న కార్యకర్తలు డ్రెయిన్లను శుభ్రం చెయ్యటం చూసిన రామారావు మాష్టారు స్పందించి కార్యకర్తలపై కవితలు చదివారు.
 
కర్నాటక వెళ్ళిన అర్జునరావు మాష్టారు అక్కడ నుండి ఫోన్ లో చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’, ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
 
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 198*వ రోజుకు చేరుకున్నాయి.
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు “ST కాలనీలో రవీంద్ర భారతి స్కూల్” వద్ద కలుసుకుందాం.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
మంగళవారం – 03-04-2018
 
ఈక్వేషన్
 
ప్రసంగాలు – ప్రవచనాలు – పరమార్థపు బోధనలు
తర్కవితర్కాలు – ధర్మాధర్మ వాదనలు
చట్టాలూ – న్యాయాలూ – సమర్థనలు – విమర్శనలు
ఒక్కపూట స్వచ్ఛసేవ కొక్కింతైన చాలవు!
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
4e792d37-f903-4fc2-be2e-4db382e3ef32
07de9660-058f-4f25-b90f-85910c808476
67137031-cec6-4fb0-a773-6e4effb1d40f
d18255f5-e271-4f7c-86af-56aa99a2728e
dee05d16-6906-4cae-99f9-e65ba0acc147
5f5f1fd6-fb8d-429d-9706-29b7a9edaf64

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *