స్వచ్ఛ సుందర చల్లపల్లి – 04-04-2018

3702f355-1bf4-48d6-82c0-99d433705d4e
1240* రోజుల సుందర గ్రామ సేవ
 
32 మంది స్వచ్ఛ కార్యకర్తలు, 6గురు బాలకర్తలు ఉదయం 4-13 గంటల నుండి 6-15 గంటల వరకు పాల్గొన్న ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో ST కాలనీలోని రవీంద్ర భారతి స్కూల్ ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేశారు. రోడ్లపైన ఉన్న మట్టిని తీసి రోడ్ల పక్కన ఉన్న పల్లాలలో సర్దారు.
 
స్వచ్ఛ కార్యకర్త ప్రాతూరి శాస్త్రి గారు ‘మనకోసం మనం’ ట్రస్ట్ కి ప్రతినెలా ఇచ్చే 5,000/- రూపాయల విరాళం చెక్కు రూపంలో అందించారు. SRYSP కాలేజీ ప్రిన్సిపాల్ తగిరిశ సాంబశివ రావు గారు ప్రతినెలా ఇచ్చే 500/- రూపాయల విరాళం ఈరోజు అందించారు. వీరిద్దరికి స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.
 
స్వచ్ఛ కార్యకర్త “వక్కలగడ్డ వెంకటేశ్వర రావు” గారు చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’, ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
 
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 199*వ రోజుకు చేరుకున్నాయి.
రేపటి కార్యక్రమం “నారాయణరావు నగర్ కార్యకర్తలతో కలిసి పని చెయ్యటం”.
ఉదయం 5-30 గంటల నుండి వారితో కలిసి నారాయణరావు నగర్ వీధుల్లో పాదయాత్ర చెయ్యటం.
ఇందుకోసం ఉదయం 4-30 గంటలకు RTC నాగేశ్వర రావు గారి ఇంటి వద్ద కలుసుకుందాం.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
బుధవారం – 04-04-2018
 
ఎవరైనా గాంధీలే
 
చేసేదే చెప్పేస్తే – చెప్పేదాన్ని చేసేస్తే
ఆలోచన – మాటలు –పనులన్ని ఒక్కటే ఐతే
అంతా గాంధీ మహాత్ములే – ఆమాటకు వస్తే
స్వచ్ఛ సైనికుల నిరంతర సాధనాలూ అందుకే!
 
-నల్లూరి రామారావు
 స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
c9fd3670-d1c3-4c9f-9cf5-b9adf0faf532
69cf2834-d093-46cd-a045-67041e3c7037
8110004d-7e17-4705-8ed6-20919400a924
a7be8371-ed85-4226-abe8-f110e7e023cc ebe90d4f-ad28-4d21-960b-8554a4ddee76
fc451ada-8d8b-4414-a0cd-bf060f1fb76b

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *