స్వచ్ఛ సుందర చల్లపల్లి – 09-03-2017

17098605_789391184548038_2251153726446179454_n

అర్థవంతమైన గ్రామసేవకు 849* రోజులు

 

ఈనాటి స్వచ్ఛంద సేవలో 40 మంది స్వచ్ఛ సేవకులు ఉదయం 4-30 గంటల నుండి 6-30 వరకు నాగాయలంక రోడ్డులో సుబ్బన్న గారి సత్రం వద్ద రోడ్డుపక్కన పిచ్చిమొక్కలు, తుక్కు తొలగించి శుభ్రం చేశారు.

 

నాగాయలంక రోడ్డులో బ్రహ్మం గారి గుడి వద్ద మొన్న ఏర్పాటు చేసిన రహదారి వనానికి, రోడ్డుకి మధ్య ‘పేవర్ టైల్స్’ తో సుందరీకరించటం జరిగింది.

 

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసి, ప్రస్తుతం తన ఊరు అయిన తాడేపల్లి గూడెం వద్ద ఉన్న చిన తాడేపల్లి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అక్కిన భవాని గారు ఈరోజు స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. మన కార్యక్రమాన్ని ప్రేరణగా తీసుకుని వారి ఊరిలో కూడా స్వచ్ఛ కార్యక్రమాలు చేయాలని వారి ఆకాంక్ష. అందుకోసం ఊరిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చూసి, అడిగి తెలుసుకున్నారు.

 

రేపటి కార్యక్రమం కోసం నాగాయలంక రోడ్డులో సుబ్బ నాగన్న గారి ఆశ్రమం వద్ద కలుసుకుందాం.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ
మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి
గురువారము – 09.03.2017

 

చిరుదీపం
ప్రజారోగ్య భవితవ్యం ప్రశ్నార్థకమైనప్పుడు
చీకటిలో చిరుదీపం చల్లపల్లి ఉద్యమం!
విమర్శకుల, సందేహుల విసురు తాకుతున్నప్పుడు –
ఆశావహ దృక్పథమే తదభివృద్దికి మూలం

నల్లూరి రామారావు
స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త

 

సహజ గుణం?
పరుల కొరకె నదులు ప్రవహించు, గోవులు
పాలిచ్చు, చెట్లు పూలు పూచు
పరహితమ్ము కంటె పరమార్థమున్నదా
లలిత సుగుణ జాల తెలుగు బాల!

సేకరణ: భోగాది వాసుదేవ రావు
స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *