స్వచ్ఛ సుందర చల్లపల్లి – 23-04-2018

2cdb8e94-08e9-4908-9568-f16dbb1901e1
1259* రోజుల స్వచ్ఛ సుందర సేవ
 
ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో 33 మంది కార్యకర్తలు ఉదయం 4-10 గంటల నుండి 6-00 గంటల వరకు చల్లపల్లి సెంటర్ నుండి బస్ స్టాండ్ వరకు రోడ్డుపై, రోడ్డుపక్కల ఉన్న దుమ్ము, చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. బస్టాండ్ లోపల కూడా ఊడ్చి శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించారు.
 
ధ్యానమండలి సభ్యులు, స్వచ్ఛ కార్యకర్త ఆత్మ పరబ్రహ్మం గారి భార్య ఆకస్మికంగా మరణించారు. ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం అనంతరం కార్యకర్తలందరూ వెళ్లి వారిని పరామర్శించారు.
 
“అనిల్ రాజు గారు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’, ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
 
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు మొదలై నేటికి 218 రోజులు.
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు “నడకుదురు రోడ్డులోని రైస్ మిల్-శ్రీనగర్ కాలనీ సెంటర్” మధ్య కలుసుకుందాం.
 
ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
సోమవారం – 23-04-2018
 
అచ్చమగు గాంధీజి శిష్యులు
 
మానకూడని మంచి వ్యసనం – స్వచ్ఛ సుందర గ్రామయత్నం
స్త్రీలు – పిల్లల కంటుకొనుటే క్షేమదాయకమైన విషయం
ఊళ్ళకంతట స్ఫూర్తి నింపే ఉత్తమోత్తమ నవ్య వ్యసనం
చల్లపల్లి స్వచ్ఛసైన్యం సాహసానికి తగిన ఫలితం!
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
33c9ed81-7c8f-424b-9f32-9395fa0013d8
037f5bcf-a71b-40bb-ba77-c90b6bc456ea
IMG_2556
IMG_2557

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *