స్వచ్ఛ సుందర చల్లపల్లి – 05-05-2018

a099bd5d-86f1-46d8-9caa-0189ebc1b5a1
స్వచ్ఛ సుందర చల్లపల్లి @ 1271*
 
ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో 33 మంది కార్యకర్తలు ఉదయం 4-13 గంటల నుండి 6-0 గంటల వరకు కోమలానగర్ లోను, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులోను పిచ్చిమొక్కలు నరికి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించారు.
 
రోడ్డుపై ఉన్న మట్టిని విజయా కాన్వెంట్ ఎదురుగా ఉన్న కమలాలలో పోశారు.
 
కొంతమంది కార్యకర్తలు విజయా అకాడమీ వారు నాటిన మొక్కలకు నామఫలకాలను (Name boards) ఏర్పాటు చేశారు.
 
SRYSP జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ తగిరిశ సాంబశివరావు గారు “మనకోసం మనం” ట్రస్ట్ కి ప్రతినెలా ఇచ్చే 500/- రూపాయలను ఈనెలకు గాను ఈరోజు అందించారు. వారికి ధన్యవాదములు.
 
“తగిరిశ సాంబశివరావు గారు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
 
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 230వ రోజుకు చేరుకున్నాయి.
 
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు “విజయా కాన్వెంట్” వద్ద కలుసుకుందాం.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
శనివారం – 05-05-2018
 
తుభ్యం నమోస్తు
 
ప్రబోధాత్మక – ప్రమోదాత్మక స్వచ్ఛసేవా ప్రగతి మార్గం
విమర్శలకూ, ముఖస్తుతులకు విముఖమట మీ అంతరంగం
అన్నిటికి ఒక సమాధానం స్వచ్ఛ సుందర మాతృగ్రామం
శ్రమల సంస్కృతి మాకు లభ్యం – స్వచ్ఛ సైన్యం నమస్తుభ్యం!
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
IMG_2892
IMG_2921
IMG_2929
IMG_2933

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *