850 రోజుల స్వచ్ఛ సుందర చల్లపల్లి విజయాలు

850 రోజుల స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమ విజయాలు

  • 85,000 గంటల నిస్వార్ధ, నిరంతర స్వచ్ఛ సేవ.
  • వరప్రసాద రెడ్డి గారి ఆర్ధిక సహాయంతో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డుల అభివృద్ధి, సుందరీకరణ.
  • గంగులవారిపాలెం రోడ్డు అభివృద్ధి, రెండువైపులా రహదారి వనముల అభివృద్ధి.
  • ఆ రోడ్డు పక్కనే 400 మీటర్ల అంతర్గత మురుగునీటి పారుదల వ్యవస్థ .
  • ఎన్.టి.ఆర్. పార్కులో అధునాతన పబ్లిక్ టాయిలెట్లు.
  • ఆర్.టి.సి. బస్టాండ్ ఆధునీకరణ, పూలవనాల అభివృద్ధి.
  • చల్లపల్లి లోని 18 వార్డులలోని 6 వార్డుల లోను, ప్రధాన రహదారి లోను చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకి తరలించుట.
  • ప్లాస్టిక్ టీ కప్పుల వాడకం పూర్తిగా ఆగిపోవడం. క్యారీ బ్యాగుల, ప్లాస్టిక్ గ్లాసుల, ప్లాస్టిక్, థర్మోకోల్ ప్లేట్ల వాడకంలో కొంత తగ్గుదల.
  • ప్రభుత్వ సహాయానికి తోడు మరికొంత ఖర్చుతో 70 వ్యక్తిగత మరుగుదొడ్లను కట్టించటం, సొంతంగా కట్టుకున్న 130 మందికి ఆర్ధిక సహాయం చెయ్యటం.
  • 95% బహిరంగ మలవిసర్జన ఆగిపోవడం.
  • రోడ్ల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల లోను 3,000 మొక్కలను నాటి, రక్షణగా కంపను కట్టి, నీరుపోసి పెంచటం, రహదారి వనాలను అభివృద్ధి చెయ్యటం.
  • ఇంటింటికీ తిరిగి పరిశుభ్రత గురించి, మొక్కల రక్షణ గురించి, చేతి సంచుల వాడకం గురించి ప్రచారం చెయ్యడం.
  • పాఠశాలలలో, కళాశాలలలో విద్యార్థులకు స్వచ్ఛ ఉద్యమంలో పాల్గొనడంపై అవగాహన కల్పించటం.
  • ‘ఆనంద ఆదివారం’ లాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో, ప్రజలలో స్వచ్ఛ అవగాహన పెంచి స్వచ్ఛ కార్యకర్తలను తయారుచెయ్యటం.
  • స్వచ్ఛ భారత్ ‘ఛాంపియన్’, ‘గ్రీన్ లీఫ్’ అవార్డులను పొందడం.
  • మరో 21 గ్రామాలలో స్వచ్ఛ ఉద్యమాలకు స్ఫూర్తి నివ్వడం, పరోక్షంగా మరెంతో మందిలో ఉత్సాహాన్ని నింపడం.
  • పరిసరాల పరిశుభ్రత పట్ల చల్లపల్లి ప్రజలలో పెరిగిన అవగాహన.
  • వాట్సాప్, పేస్ బుక్ ల ద్వారా ప్రవాసాంధ్రులను ఉత్తెజపర్చటం.
  • గ్రామస్తులలో శ్రమదాన సంస్కృతి, అర్థదాన సంస్కృతి కలిగించటం.
  • జనంలో ఫ్లెక్సీల, ప్లాస్టిక్ వస్తువుల మోజు తగ్గడం.
  • ఈగల దోమల వ్యాప్తి ఉధృతిని తగ్గించటం.
  • స్వచ్చత – శుభ్రత – సుందరీకరణల పట్ల అత్యధిక గ్రామస్తులలో సానుకూలత.

భవిష్యత్తులో….

  • చల్లపల్లిలో సంపూర్ణ పరిశుభ్రత, సుందరీకరణ.
  • చల్లపల్లి మొత్తం అంతర్గత మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించటం.
  • ప్రతిరోజూ ఒక గంటసేపు మన ఊరి కోసం పనిచెయ్యాలనే భావన అందరిలో వచ్చి చల్లపల్లి లోని 20,000 మంది ప్రజలు స్వచ్ఛ ఉద్యమ కార్యకర్తలుగా తయారవ్వడం. వీలు కానప్పుడు వారానికి ఒక్కరోజైనా ఊరికోసం పని చేయాలనే స్పృహ కల్పించడం.
  • క్యారీబ్యాగుల, ప్లాస్టిక్ గ్లాసుల, ప్లాస్టిక్ ప్లేట్ల వాడకం పూర్తిగా ఆపడం.
  • ఘన వ్యర్థ పదార్ధాల నిర్వహణ శాస్త్రీయంగా జరిపి ‘జీరో’ వేస్ట్ గ్రామంగా తయారవ్వడం.
  • జన సమ్మర్ధం ఉండే ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చెయ్యడం.
  • గ్రామ పంచాయతీకి సొంతంగా నిర్వహణా సామర్థ్యం వచ్చేవరకు సహాయం చెయ్యడం.
  • స్వచ్ఛత, శుభ్రత, పర్యావరణ భద్రత, సుందరీకరణ పౌరుల జీవన విధానంగా మలచటం.

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

మేనేజింగ్ ట్రస్టీ

మనకోసం మనం ట్రస్ట్

స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త

ది. 10-03-2017

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *