నిజమైన ప్రజా ఉద్యమం స్వచ్ఛ సుందర చల్లపల్లి

నిజమైన ప్రజా ఉద్యమం స్వచ్ఛ సుందర చల్లపల్లి

  • 850 రోజుల క్రితం మనం ఎవరికి ఎవరమో!

మరి నేడో….. ఒకరికి ఒకరం.

 

  • 850 రోజుల క్రితం మనకు ఆవేశకావేశాలు మెండుగానే ఉండేవి.

మరి నేడో….. సహనం పాలు ఎక్కువ, ఆవేశం తక్కువ. (ఓపిక ఎక్కువ, ఆవేశం తక్కువ)

 

  • 850 రోజుల క్రితం నాకోసం నేను.

మరి నేడో…. మనకోసం మనం.

 

  • 850 రోజుల క్రితం మన చల్లపల్లి ఇలా ఉండబోతుందని మనం ఎవరైనా కలగన్నామా?

సొంత అన్నదమ్ముల మధ్యనే బంధాలు తగ్గుతున్న ఈరోజుల్లో బంధాలకే కొత్త అర్థాలు తెచ్చారు కదా మన కార్యకర్తలు. మా చిన్నప్పుడు నాగాయతిప్పలో కులాల కతీతంగా బాబాయి, వదినా, అన్నా, అక్కా అనే వరుసలతోనే పిలుచుకునే వారు. మళ్ళీ ఆ  పిలుపుల మధురిమలు మన స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో వినిపిస్తున్నాయి.

 

  • గుడిలో పూజారి

బడిలో మాష్టారు

చర్చిలో పాస్టరమ్మ

ఇంటిలో గృహిణి

పొలం దున్నే రైతు

ఆసుపత్రిలో నర్సు

డాక్టర్లు, లాయర్లు,

డ్రైవర్లు, కాంపౌండర్లు

సొంత వ్యాపారస్థులు

ప్రజా ప్రతినిధులు

చిరుద్యోగి, పెనుద్యోగి

చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు

 

 

ఒకరేమిటి? అన్ని వయసుల వాళ్ళు, అన్ని వృత్తుల వారు, అన్ని కులాల, మతాల వారు ఈ ఉద్యమ కార్యకర్తలే.

 

  • ఊరు కాస్త పరిశుభ్రంగా ఉండడాన్ని, మరి కాస్త అందంగా ఉండడాన్ని, కలిసి పనిచేయటంలో ఉండే కాస్త సంతోషం తప్పితే మరేమి కోరుకుంటున్నారీ కార్యకర్తలు?

 

అందుకే ఇది నిజమైన ప్రజా ఉద్యమం అంటున్నాను. మీ అందరితో కలిసి పనిచేసే అవకాశాన్ని, అదృష్టాన్ని పొందినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మన ఉద్యమం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ….

 

ఇట్లు

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

మేనేజింగ్ ట్రస్టీ

మనకోసం మనం ట్రస్ట్

స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త

ది. 10-03-2017

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *