ఈరోజు జరిగిన ఒక సంఘటన

 

ఈరోజు ఉదయం 40 మందిమి సెంటర్ లో రోడ్లను ఊడుస్తున్నాము. కారులో వెళ్తున్న ఒకాయన పేపర్ నేప్కిన్ లో ఉన్న కిళ్ళీని రోడ్డు మీదకు పడేశారు. మన కార్యకర్తల్లో ఒకరు ‘మేము ఊడ్చిన తరువాత మీరిలా వేస్తే ఎలాగండి?’ అని నవ్వి ఆ కిళ్ళీని చెత్తబుట్టలో వేసి మళ్ళీ రోడ్డు ఊడ్వడానికి వెళ్ళారు.  కారులో ఆయన దిగివచ్చి ‘రాజమండ్రి నుండి ఒక పెళ్ళికి వచ్చాం. తిరిగి వెళ్తున్నాము. మీ ఊరు చాలా బాగుంది. దినపత్రికల్లో కూడా ఈ ఊరి వార్తలు చదివి మంచిగా చెప్పుకుంటున్నాము. అలవాటుగా అలా బయట పడవేశాము. ఏమీ అనుకోవద్దు. సారీ’ అని చెప్పి వెళ్ళారు.

 

మనం ఇలా సున్నితంగా కౌన్సిలింగ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నాలుగేళ్ల క్రితం మనం కూడా ఇలాగే రోడ్ల మీద చెత్తను వేస్తూ ఉండేవాళ్ళం కదా!

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

07-05-2018

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *