స్వచ్ఛ సుందర చల్లపల్లి – 10-05-2018

TSR_0922
1276* రోజుల నిరంతర గ్రామసేవ
 
ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో 35 మంది కార్యకర్తలు ఉదయం 4-15 గంటల నుండి 6-10 గంటల వరకు పడమట వీధిలో తారురోడ్డుపై 8 నుండి 10 అడుగుల మేర ఉన్న మట్టిని తొలగించారు. బస్టాండ్ నుండి బ్రహ్మం గారి గుడి వరకు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేశారు.
 
కొన్నిచోట్ల రోడ్డు మార్జిన్ వరకు ఆక్రమణలు ఉండటం కార్యకర్తలు గమనించారు.
 
బాల కార్యకర్తలు “ఆరవ్, ఆర్య లు ” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
 
235 రోజులుగా స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
 
ప్రధాన రహదారి ఆశించినంత శుభ్రంగా లేకపోవడం, ముఖ్యంగా టైల్స్ ఉన్న ప్రాంతంలో మట్టి అట్టలాగా కట్టి ఉండటంతో కార్యకర్తలు కొద్దిరోజులు ప్రధాన రహదారిని శుభ్రం చేయాలని భావించారు. అందులో భాగంగా కీర్తి హాస్పిటల్ వద్ద నుండి స్వచ్ఛ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించారు.
 
ప్రధాన రహదారిలో ఉన్న టాక్సీ స్టాండ్ వెనుక ఖాళీ స్థలం, బందరు రోడ్డులో ఒక చిన్న ప్రైవేటు ఖాళీ స్థలం, బ్రాహ్మణ సత్రం-శివాలయం మధ్యన ఉన్న ప్రాంతం డంపింగ్ యార్డుల వలే ఘోరంగా ఉన్నాయి. కొంతమంది కార్యకర్తలు మన కార్యక్రమంలో భాగంగా వీటిని కూడా శుభ్రం చేద్దామని భావిస్తున్నారు.
 
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు “బందరు రోడ్డులోని కీర్తి హాస్పిటల్” వద్ద కలుసుకుందాం.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
గురువారం – 10-05-2018
 
ఇంకొన్ని ప్రశ్నలు
 
వ్యక్తి కొన్నివిధాల ఉన్నతుడైనచో అది చాలునా?
సమాజానికి వ్యక్తికీ ఒక జారుముడి సరిపోవునా?
తనను పెంచిన సమాజానికి ఋణం తీర్చగ వద్దనా?
స్వచ్ఛసైన్యం కృషి సమాజం ఋణం తీర్చుట కాదనా?
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
0f99d04f-d633-448e-935a-74927d7d8e48
8e91a6fc-399b-44c0-99bd-ecf463a9fedb
74ce959a-ae11-4dc5-8f69-d1e02b8f2be2
8954dcad-5fe2-42dc-801e-290e0beae70e
a8154eab-e1dd-420c-aa25-80421a296c7e
aed7dd1d-5c42-4f28-b3ba-f87a65ee39da
e0f2e8c4-a894-45cd-9a68-c0ca5f5359ae (1)
e0f2e8c4-a894-45cd-9a68-c0ca5f5359ae
e756d91e-72f1-4f83-967a-1877bded2ac6

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *