స్వచ్ఛ సుందర చల్లపల్లి – 11-05-2018

c89d463e-fa51-444b-868b-2bbc3eca352b
స్వచ్ఛ సుందర చల్లపల్లి @ 1277*
 
ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో 40 మంది కార్యకర్తలు ఉదయం 4-15 గంటల నుండి 6-10 గంటల వరకు బందరు రోడ్డులో కీర్తి హాస్పిటల్ వద్ద నుండి డా. మధుసూదన రావు గారి హాస్పిటల్ వరకు రోడ్డుపై మట్టిని తొలగించారు. పేవర్ టైల్స్ పై పేరుకుపోయిన మట్టి, దుమ్మును శుభ్రం చేశారు.
 
కొంతమంది కార్యకర్తలు డంపింగ్ యార్డులా తయారైన 6వ నెంబర్ కాల్వను శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించారు.
మరికొంతమంది పద్మావతి హాస్పిటల్ రోడ్డును శుభ్రం చేశారు.
 
కొంతమంది కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులో మొక్కలకు నామపలకలను (Name boards) తగిలించారు.
 
స్వచ్ఛ కార్యకర్త ప్రాతూరి శాస్త్రి గారు ప్రతినెలా ‘మనకోసం మనం’ ట్రస్ట్ కి ఇచ్చే 5,000/- రూపాయల విరాళం ఈనెలకు గాను ఈరోజు అందించారు. వారికి స్వచ్ఛ కార్యకర్తలందరి తరఫున ధన్యవాదములు.
 
బాల కార్యకర్తలు “ఆరవ్, ఆర్య లు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
 
236 రోజులుగా స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు “డా. మధుసూదనరావు గారి హాస్పిటల్” వద్ద కలుసుకుందాం.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
శుక్రవారం – 11-05-2018
 
సందేహ ప్రశ్నలు
 
స్వంత ఊళ్ళో – ఉన్న ఊళ్ళో – స్వచ్ఛతే ఆరాధ్యమా?
మీన మేషాల్ లెక్కవేస్తే తక్షణ కృషి లుప్తమా?
సేవ అనుకో – బాధ్యతనుకో – చేసిచూపుత ముఖ్యమా?
స్వచ్ఛసైన్యం నిత్యకృషి ఈ సమాజానికి పాదమా?
 
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
05e5f07c-bd1c-49c5-bef8-d3440e56bd55
5a0ee931-1322-4de9-ba79-db5d441ca414
5c8d56af-66a2-4e88-a57a-8ec1fbbc8c8f
c8ab4e42-4c1d-4e6f-8a49-1c97baa3fd8e
fa5b8838-d578-4a2a-9527-3aae08f8778b
9018ef27-52f4-40c1-963a-c7a63d7bc0f6

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *