స్వచ్ఛ సుందర చల్లపల్లి – 12-05-2018

af6a122c-1657-4251-b141-7b79a093a4a5
స్వచ్ఛ సుందర చల్లపల్లి @ 1278*
 
ఈనాటి స్వచ్ఛ కార్యక్రమంలో 20 మంది కార్యకర్తలు ఉదయం 4-10 గంటల నుండి 6-00 గంటల వరకు బందరు రోడ్డులో రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద నుండి రామాలయం వరకు రోడ్డుకిరువైపులా ఊడ్చి శుభ్రం చేశారు.
 
“ల్యాబ్ రవి గారు” చెప్పిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ‘స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం’ అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.
 
40 మంది స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు ఈరోజు ఉదయం 4-30 గంటలకు పోలవరం సందర్శనకు బయలుదేరి వెళ్ళడం జరిగింది.
 
237 రోజులుగా స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు “బందరు రోడ్డులో రామాలయం” వద్ద కలుసుకుందాం.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
శనివారం – 12-05-2018
 
స్వచ్ఛతకే జన స్వాగతం
 
జనం నుండే – జనం కొరకే – జనం వల్లే స్వచ్ఛత
స్వచ్ఛ సైన్యం కేటలిస్టే – జరుగు కృషి ఒక ధన్యత
ఎవరి మెప్పుకొ – హేళనలకో స్వచ్ఛ సత్కృషి ఆగదు
స్వచ్ఛ సుందర చల్లపల్లిని స్వాగతించుట మానదు!
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
0f6a97cd-4307-4b2a-a092-71702921c570
2730b4fb-a55d-4cfa-b869-999cf94647e2
a2452074-304d-4bfa-b6d9-1b6cf615051f

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *