జై స్వచ్ఛ కార్యకర్తా

మధురాతిమధురం 1100 రోజుల సుమధుర ఘట్టం.
ఒకటవ రోజు అనుకున్నామా సంవత్సరం సేవచేస్తామని.
100వ రోజు అనుకున్నాము ఒక సంవత్సరం సేవ చేద్దామని.
సంవత్సరం సేవ చేసిన మన కార్యకర్తలకు రెండవ సంవత్సరం తెలియకుండానే గడచింది.
దర్శనీయప్రాంతంగా పలువురు చూడడం, ప్రముఖుల ప్రశంసలు , అధికారుల అండదండలతో అలవాటుగా మూడవ సంవత్సరం ముచ్చటగా మెరిపించాము.
మరింత ఉత్సాహంతో సేవ చేసే కార్యకర్తలను చూస్తుంటే మన దైనందిన జీవితంలో కాలకృత్యంలాగా అయింది.
సుందరీకరణ బృందం వర్మికంపోస్టు ముడిసరకుల సేకరణ చేస్తోంది.
సడలని సేవాదీక్ష మరింత పట్టుదలను నేర్పుతోంది
సేవలో ఎంత తెలియని ఆనందం ఉంటుందో గదా.
అప్పుడప్పుడనిపిస్తుంది 1100 నుండో 11000 అయినా అశ్చర్యపోనక్కర్లేదు.
మనలను ఆశీర్వదించడానికి వచ్చే
అతిధుల ప్రోత్సాహం మన శ్రమను మరచిపోయేలా చేస్తోంది.
అత్యుత్సాహం లభిస్తోంది.
 
జై స్వచ్ఛ కార్యకర్తా.
 
-ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
15-11-2017

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *