LWD Papers on roads

10వ తరగతి పరీక్షల చివరి రోజు, ఇంటర్మీడియట్ పరీక్షల చివరి రోజు విద్యార్థులు ఇంటికి వెళ్తూ కాగితాలు చించి రోడ్ల మీద పడవెయ్యటం ఎప్పటినుంచో ఉన్న అలవాటు. స్కూల్ చివరి పనిదినాన కాగితాల మీద LWD అని రాసి రోడ్ల మీద పడవెయ్యటం కూడా పిల్లలకు అలవాటే. దీనివలన రోడ్లు అపరిశుభ్రంగా కనిపిస్తూ ఉండటంతో గత మూడు సంవత్సరాల నుంచి స్కూల్, కాలేజీ యాజమాన్యాలతో స్వచ్ఛ కార్యకర్తలు చర్చించి దాదాపుగా ఈ సంవత్సరం ఈ అలవాటుని మాన్పగలిగారు.  ఈ సంవత్సరం కలెక్టర్ గారు కూడా ఈ అలవాటుని మాన్పించండని స్కూల్, కాలేజీ యాజమాన్యాలకు సర్కులర్ జారీ చేసినట్లు తెలిసింది.

 

ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల చివరి రోజు, ఇంటర్మీడియట్ పరీక్షల చివరి రోజు మాత్రం ఎవరూ రోడ్ల మీద కాగితాలు వెయ్యలేదు. స్కూల్స్ కి చివరి పనిదినమైన మొన్న సాయంత్రం మాత్రం కొంతమంది పిల్లలు రోడ్లపై కాగితాలు వదులుకుంటూ వెళ్ళారు. వచ్చే సంవత్సరం ఈవిధంగా జరగకుండా స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలతో చర్చిద్దాం.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

23-04-2018

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *