స్వచ్ఛ సుందర చల్లపల్లి – 29-06-2018

1ad7fc89-7b17-424b-90a0-1b591feb4511
ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం.
 
స్వచ్ఛ సుందర చల్లపల్లి @ 1326* రోజులు
 
ఈనాటి గ్రామసేవలో పాల్గొన్న కార్యకర్తలు 30 మంది. ఉదయం 4-03 గంటల నుండి 6-00 గంటల వరకు బందరు రోడ్డులో కీర్తి హాస్పిటల్ వద్ద నుండి మునసబు గారి బజారు, ఒకటవ వార్డు ముఖద్వారం వరకు రోడ్డు మీద, రోడ్డుపక్కల టైల్స్ పై ఉన్న దుమ్ము తొలగించారు. రోడ్డుపక్కల ఉన్న చెత్త శుభ్రం చేసి డంపింగ్ యార్డుకి తరలించారు.
 
వేడుకలలో ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వాడనివ్వవద్దని గ్రామంలోని అన్ని కళ్యాణమండపాలకు వినతిపత్రాలను ఇద్దామని ఈరోజు కార్యక్రమంలో అనుకున్నారు. దీనికి ఆకుల దుర్గా ప్రసాద్ గారి నాయకత్వంలో ఒక బృందం త్వరలో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
 
“అర్జునరావు మాష్టారు” చెప్పిన నినాదాలతో నేటి కార్యక్రమం ముగిసింది.
 
రేపటి కార్యక్రమం కోసం “వర్షం వస్తే సెంటర్”లో,
వర్షం లేకపోతే “నాగాయలంక రోడ్డులో అమరస్థూపం దాటిన తరువాత” కలుద్దాం.
 
స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలకు 285 రోజులు.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
శుక్రవారం – 29-06-2018
 
బహుశా ఇవి కారణాలు
 
ఊరు ఇంత దరిద్రంగా ఉండుటెందు కనే ప్రశ్న
మంచి చెడుల గూర్చి జనం మాటాడని అయోమయం
సౌచం – శుభ్రత పట్టని శాస్తల దారుణ మౌనం
స్వచ్ఛోద్యమ చల్లపల్లి సాగేందుకు కారణం!
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
1f61e1e9-5c91-4888-a7ed-b3350a1df513
2c64b57d-b275-4190-be58-5fdbf23f4379
5bf6e800-e2f6-4b49-af89-81382024f0ec
655ec73f-63f4-474a-baf5-e115bb7ed48d

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *