*నిజంగా స్వచ్చంగా ఉన్న యార్లగడ్డ*....           02-Mar-2020

 *నిజంగా స్వచ్చంగా ఉన్న యార్లగడ్డ* 

            నిన్న ఉదయం పాద యాత్రానంతరం స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు యార్లగడ్డ వీధులలో సంచరించారు.

            ఒకప్పుడు చల్లపల్లి గంగులవారిపాలెం రోడ్డు వలె బహిరంగ మల విసర్జనతో దుర్గంధ భూయిష్టంగాను, పిచ్చి మొక్కలతోనూ ఉండే  శ్రీ నాగమల్లి కోటేశ్వర ఆలయం వరకు ఉన్న రోడ్డు ఇప్పుడు విశాలంగానూ, శుభ్రంగానూ, పూల మొక్కలతో చూడ ముచ్చటగా ఉందని గతంలో గుడికి వచ్చిన  కొంతమంది కార్యకర్తలు  అభిప్రాయపడ్డారు.

            పురిటిగడ్డ నుండి యార్లగడ్డ వరకు ఉన్న రోడ్డు ప్రక్కలు కూడా ఇలాగే దుర్గంధ భూయిష్టంగా ఉండేదని చల్లపల్లి కార్యకర్తలు గుర్తుచేసుకున్నారు.

            చెరుకు కూలీల కోసం త్రవ్వించిన Borehole Latrine లు మంచి ఫలితాలు ఇచ్చాయని స్వచ్చ యార్లగడ్డ కార్యకర్తలు చెప్పారు.

            చెరువు ఒడ్డు నాలుగు సంవత్సరాల క్రితం పెట్టిన మొక్కలు పూలతో సుందరంగా ఉంది. ఈ మొక్కలలో కొన్ని స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు కూడా నాటారు.

            చెరువు మరో ఒడ్డు ప్రక్కన ఉన్న 70 సెంట్ల గ్రామ పోరంబోకులో స్వచ్చ కార్యకర్తలే మినుము పంట వేసి పండిస్తున్నారు.

            గ్రామమంతా సిమెంట్ రోడ్లు ఉన్నాయి.

            చక్కగా పెంకులతో వేసిన పాత ఇళ్ళు, ఆధునిక భవనాలు, పళ్ల మొక్కలతో ఉన్న దొడ్లతో గ్రామమంతా చూడముచ్చటగా ఉంది.

            గ్రామంలోని అన్ని వీధులకు రెండు వైపులా స్వచ్చ యార్లగడ్డ కార్యకర్తలు నాటిన నీడనిచ్చే మొక్కలు, పూల మొక్కలు (850) చక్కగా పెరుగుతున్నాయి.

             శబ్ద కాలుష్యం లేకుండా శుభ్రంగా, స్వచ్చంగా, ముచ్చటగా ఉన్న ఒక పల్లెటూరు ను చూడాలంటే యార్లగడ్డ ను చూసి రావచ్చు.  

            గత 152 రోజులు నుండి స్వచ్చ యార్లగడ్డ కార్యకర్తలు చేసిన శ్రమకు జోహార్లు.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

02.03.2020. 

పళ్ల మొక్కలతో, పూల మొక్కలతో ఉన్న దొడ్లు
102 సంవత్సరాల యార్లగడ్డ వాసితో ఫోటో