స్వచ్చ కార్యకర్తల మనోభావాలు

డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య - 21.11.2023 ...

ఆనంద - ఆరోగ్య వర్థిని – మా స్వచ్చోద్యమ చల్లపల్లి. ప్రతి బ్రహ్మముహుర్తంలోనూ పాతిక ముప్పై మందితో కలిసి, పాతిక – ముప్పై వేల మంది గ్రామస్తుల ఆరోగ్యం కోసం శ్రమించడం ఎంత సంతోషమో కదా! ఈ ఉద్యమం తొలి రోజుల్లో వినడానికి వింతగా అనిపించింది - తుస్సు మనకుండా ఎన్నాళ్లు నిలుస్తుందిలే అనిపించింది. చూస్తుండగానే 50-100-200 రోజులు గడిచిపోతే గాని నేనందులో కలవలేదు. మొక్కల్ని ప్రాణప్రదంగా చూసుకొనే నాకు కార్యకార్తలు వేల కొద్దీ మొక్కలు రహదార్లలో నాటి పెంచడం స్ఫూర్తి నిచ్చింది. శ్రమదానంలోకి కాస్త ఆలస్యంగా వచ్చినా అందరు కార్యకర్తల్తో బాటు శ్రమదానం బాట పట్టడం సంతృప్తినిచ్చింది. తొలి రో...

Read More

ముత్యాల లక్ష్మి - 18.11.2023...

 ఊరి బాధ్యతంతా మనదేననుకొని.....             పెద్దా - చిన్నా కార్యకర్తలందరికీ నమస్కారాలండి! నా పేరు ముత్యాల లక్ష్మి. చంటి హోటలంటే చాలు - అందరికీ బాగా తెలుస్తుంది. ఎవరికి వాళ్లం కుటుంబాల - పిల్లల బాధ్యతల్ని చూసుకోవడమే చాల గొప్పండి. మరి అవి చూసుకొంటూనే నా బజారు, నా ఊరు పరిశుభ్రతల బరువు మోయడమంటే - అదీ తొమ్మిదేళ్ళ నుండీ - ఎంత మంచి పెద్ద పనో ఆలోచిస్తుంటే ఈ స్వచ్ఛ కార్యక్రమం ఎంత గొప్పదో అర్థమౌతున్నది.             ప్రతివాళ్లూ “నాకు పంచాయతీ ఇది చెయ్యలేదు - వార్డు మెంబరు అది చెయ్యలేదు. మా ఓట్లేయించుకొన్న ఎమ్.ఎల్.ఏ మళ్లీ కనపళ్ళేదు” అనుకోవడమే గాని, ...

Read More

పసుపులేటి ధనలక్ష్మి - 18.11.2023...

 ఈ ఉద్యమం ఎంత సులభమనిపిస్తుందో అంత కష్టం             అందరికీ వందనాలు. నేను పసుపులేటి ధనలక్ష్మి నండి. పెద్ద చదువు లేకపోయినా మొదట్లో ధైర్యంచేసి రాలేకపోయినా, 50 రోజుల తరవాత వచ్చి కలిసినా, ఇంత పెద్ద పెద్దవాళ్లు నన్ను కూడ తమతో సమానంగా - ఒక స్వచ్ఛ కార్యకర్తగా గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలండి.             ఒకప్పుడు నేను వార్డు మెంబరుగా ఉన్నప్పుడే నయమండి – ఎక్కువ రోజులు వచ్చి, అందరితో పాటు వీధులు శుభ్రం చేసేదాన్ని. పిల్లల పెళ్లిళ్లూ, వాళ్ళ పిల్లల మంచీ చెడులూ, ఇతర ...

Read More

గౌరుశెట్టి నరసింహారావు - 18.11.2023...

 జై గురుదేవ! జై స్వచ్ఛ సుందర చల్లపల్లి!! పెద్దలకూ – పిన్నలకూ తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. చల్లపల్లి సెంటర్ లో జరిగిన శ్రమదానోద్యమ శత దినోత్సవం నుండీ నాకీ కార్యక్రమంతో అనుబంధం ఏర్పడింది. నాకు ఏ రోజైనా - ఏ కారణం చేతైనా దీని పట్ల కాస్త పట్టుదల తగ్గినప్పుడల్లా - వాళ్లది కాని గ్రామ సౌకర్యాల కోసం లక్షలు ఖర్చు చేస్తున్న, శారీరక శ్రమ చేస్తున్న, అంతకు మించి విలువైన తమ సమయాన్ని సమర్పిస్తున్న డాక్టర్ దంపతుల్ని చూస్తే చాలు - పునరుత్తేజం పొందుతాను! అసలిం...

Read More

పల్నాటి అన్నపూర్ణమ్మ - 18.11.2023...

ఉద్యమంలో పాల్గొనకముందూ – తర్వాతా అందరికీ నమస్కారాలు తండ్రీ! 10 నెలలుగా ఊరి శ్రమదానానికి దూరంగా ఉండడం ఎంత కష్టమో తెలుసుకొన్న పల్నాటి అన్నపూర్ణనండి! యాక్సిడెంట్ లో కాలు నుజ్జై, బహుళ శస్త్రచికిత్సలు జరిగి, నెలల తరబడి ఫిజియోథెరపీల తర్వాత గత నాలుగు రోజుల నుండీ మన స్వచ్చోద్యమ ప్రపంచంలోకి నా కాలు మోపుతున్నందుకు ఆనందంగా ఉన్నది. ఇన్నాళ్లుగా నన్ను పరామర్శిస్తూ మానసికంగా అండగా నిలుస్తూ - ఒక సోదరిగా కనిపెట్టుకొచ్చిన మీకూ, మన డాక్టర్లిద్దరికీ ధన్యవాదాలు. మరీ ఈ నాలుగైదు రోజుల్నుండైతే ప్రతి కార్యకర్తా “జాగ్రత్తమ్మా! ఇక్కడి దాకా నువ్వు వచ్చిందే చాలు, ఎక్కువగా పనిచేయొద్దు, ఎప్పుడు ...

Read More

05.02.2023 ...

          ఇదొక లోకోత్తర త్యాగము! హిమాలయములు ఎక్కుటా ఇది? ప్రమాదాలను కౌగిలించుట? గాలిలో వ్రేలాడు ఆటా? నేల విడిచిన సాము చేటా? కాదుకాదిది కేవలం సొంతూరి మేలుకు చేయు యత్నం ఇదొక లోకోత్తర త్యాగమ? ఇదొక అంతిమ మహాదర్శమ?...

Read More

ప్రాతూరి శాస్త్రి - 12.11.2020 ...

 ## అంతం కాదిది ఆరంభం## ఉద్యమానికి అంతం లేదు అందునా స్వచ్ఛ సుందర చల్లపల్లి మహోద్యమం, శ్రమజీవన సౌందర్యం నేర్పిన ఉద్యమం, శ్రమసంస్కృతిని దేశానికి చాటిన ఉద్యమం. 2000 రోజులు నిర్విరామంగా, అలుపెరగక శ్రమించి త్యాగధనులైన ఉద్యమం ప్రయత్నించి ప్రజల ఆలోచన, అలవాట్లు, జీవనము,అవగాహన మార్చగలిగిన మహోద్యమం, నమస్కారాలు, విజిల్స్, టార్చ్ లైట్లు, చేతిలో కర్ర లతో ఉద్యమ విజయానికి బీజం పడిన ఉద్యమం, చెత్తపై సమరము జేసి,, నలుదిశలా హరితవనాలు ఏర్పాటుతో మిగిలిన గ్రామాలకు స్ఫూర్తినిచ్చిన ఉద్యమం, డా. గురవారెడ్డి, ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 11.11.2020...

 The Respirator (He, the man, not only Respirator but the great booster) ఎవరు వీరు అనుకుంటున్నారా: ఎవరి రాకకై కార్యకర్తలు ఎదురుచూస్తుంటారో, ఎవరి మాటలకు కార్యకర్తలు ఉత్తేజితులౌతారో, ఎవరు ప్రసంగిస్తే కార్యకర్తలు కదలక చెవులు రిక్కించి వింటారో, ఎవరి పలుకులకు కార్యకర్తలు ప్రభావితులై కార్యన్వితులౌతారో,            ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 10.11.2020...

 స్వచ్ఛ సుందర చల్లపల్లి పై సుందర గీతాలు రచన : శ్రీ నందేటి శ్రీనివాస్ 1. ఓ యువతీయువకుల్లారా పల్లవి : ఓ యువతీయువకుల్లారా -- సమాజపు సారధులారా.  /2/            ఈదేశానికి మీరే సుగమ కర్తలు కావాలి.            రేపటి స్వచ్ఛ సమాజానికి మీరే రథసారధులవ్వాలి   /ఓ/  చరణం: అపరిశుభ్రత మురికి వీధులే - అంటురోగాల నిలయాలు             ...

Read More

ప్రాతూరి శాస్త్రి 09.11.2020. ...

 స్వచ్ఛ సుందర చల్లపల్లి లో దాదాపుగా కార్యకర్తలు అందరూall rounders.              సీనియర్ సిటిజెన్ విభాగము నుండి శ్రీ మాలెంపాటి గోపాలకృష్ణయ్య.  వీరిని గురించి రిటైర్డ్ ప్రిన్సిపాల్, శ్రీ నల్లూరి రామారావు గారు ఇలా వచించారు.  అమాయకుడా, కార్యసాధకుడా – అది చెప్పుట కష్టం- డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య, B.V.Sc. నిమ్మగడ్డలో జననం – చల్లపల్లి నివాసం ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 08.11.2020. ...

 స్వచ్ఛ అమృతలూరు   నిన్న సాయంత్రం గుంటూరు జిల్లా అమృతలూరులో “స్వచ్ఛ అమృతలూరు” సాధన గురించి అక్కడ ప్రజలతో ఒక సమావేశం జరిగింది. గతంలో అమృతలూరు మండలాధ్యక్షులుగా పనిచేసిన రత్న ప్రసాద్ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, గ్రామ సర్పంచ్ హాజరైన ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా ప్రజలు హాజరైనారు. ఈ సమావేశంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం, చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా రావడం విశేషం.   ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ పై ఫోటో ఎక్జిబిషన్ ఏర్పాటు చేశాము. ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యక్రమ విశేషాలన్నింటిని వివరించటం జరిగింది. కార్యకర్తల నిస్వార్థ సేవా నిరతి, సమిష్టి కృషి...

Read More
[1] 2 3 4 5 ... > >>