స్వచ్ఛ సుందర చల్లపల్లి పై సుందర గీతాలు
రచన : శ్రీ నందేటి శ్రీనివాస్
1. ఓ యువతీయువకుల్లారా
పల్లవి : ఓ యువతీయువకుల్లారా -- సమాజపు సారధులారా. /2/
ఈదేశానికి మీరే సుగమ కర్తలు కావాలి.
రేపటి స్వచ్ఛ సమాజానికి మీరే రథసారధులవ్వాలి /ఓ/
చరణం: అపరిశుభ్రత మురికి వీధులే - అంటురోగాల నిలయాలు
మనకెందుకులె అనుకుంటే - భావితరాలకు శాపాలు
మనకోసం మనమనుకుంటే - అందరమొకటై సై అంటే /ఓ/
స్వచ్ఛ భారతికి చల్లపల్లి - ఒక మార్గదర్శకం కావాలి
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆరోగ్య కల్పవల్లవ్వాలి /ఓ/
చరణం: ఇల్లు వీధి డ్రైనేజీలు నీ పరిసరాల పరిశుభ్రం
ఒక్క అడుగు స్వచ్ఛతవైపేస్తే మన ఆరోగ్యం మన సొంతం
పీల్చేగాలిని తాగే నీటిని - నింగి నేలను రక్షిస్తానని /2/
స్వచ్ఛ భారతి సాక్షిగా - నువ్వు ప్రతినబూని సాగాలి
స్వచ్ఛ సుందర చల్లపల్లీ - మన దేశ చరిత్రలో నిలవాలి.
@@ @@ @@
2. కదలిరండి - కలసిరండి
పల్లవి: కదిలిరండి కలసిరండి - స్వచ్ఛ చల్లపల్లి కై
శ్రమశక్తే మూలధనం - ఆరోగ్యమే దాని ఫలం /కదలి/
చరణం: విద్యార్థులు, మేధావులు వైద్యులు, ఉద్యోగులంత
ఊరికొరకు పట్టుబట్టి, పరిశుభ్రత బాట పట్టి స్వచ్ఛతకై జై కొట్టి
చీపురు చేపట్టినట్టి ఘట్టమెక్కడుందిరా - అది స్వచ్ఛ చల్లల్లిరా /క/
చరణం: ఇంటిలోన చెత్త తీసి వీధిలోన పారవేసి
పరిశుభ్రత పాడుజేసే - సాంప్రదాయమొద్దురా
- ఆరోగ్యం ముద్దురా /కదలి/
చరణం: ఇల్లు వీధి డ్రైనేజీ పరిసరాల పరిశుభ్రం
మనకోసం మనమంటే - ఊరువాడ పరిశుభ్రం
పచ్చని చెట్లను నాటితే - ఊరికి ఎంతో అందం
ఆరోగ్యమే మరి భద్రం /కద/
.. .... .....
3. ముంచుకొస్తున్నాదే
పల్లవి: ముంచుకొస్తున్నాదీ, అనారోగ్య
మంత్రం
ముందుకొచ్చి ఆపండి
అందరికీ దండం. /ము/
చరణం: ఎవరెవరో రావాలని
ఎదురుచూస్తూ వుంటారా
మనవూరిని మనమే
బాగుచేయకూడదంటారా
చెత్త, ప్లాస్టిక్ వ్యర్థం
రోడ్లమీద పారేస్తే
ఈగల దోమల మయమై
అంతా కాలుష్యమై /ము/
చరణం: స్వచ్ఛ చల్లపల్లీ కార్యకర్తలతో
చేయి కలిపి
చల్లని పల్లెకు మనము ఒకరి
కొకరు భుజం కలిపి
మానవాళి మనుగడకు
ఆధారం చెట్లుగా
నాటండిక మొక్కలను
నేల ఈనినట్లుగా. /ము/
స్వచ్ఛ గీతాలు
4. గాంధీజీ బతికుంటే
పల్లవి: గాంధీజీ బతికుంటే మీ
గడపకొచ్చేను
ఘనమైన మీ పోరు చూసి
గర్వించేను
త్యాగమూర్తుల గన్న తల్లీ
నువ్వే మా స్వచ్ఛ సుందర
చల్లపల్లీ. /గాం/
చరణం: చెత్త చెదారంతో నిండిన
దారులు
చేత చీపురు బట్టి ఊడ్చిన
వారలు /2/
ముందుకు నడవని మురుగు
కాల్వలను
మీ చేతితో నెట్టి పరుగు
పెట్టించిన
స్వచ్ఛ మనసుతో వున్నా
నిజమైన స్వచ్ఛ సేవకులన్న
మీరంతా. /గాందీ/
చరణం: వేల మొక్కలే నాటి
సంరక్షణే జేసీ
మండుటెండలోన జీవధార
పోసి. /2/
గ్రామమంతా స్వచ్ఛ
రధములనూ పంపి.
చెత్తను యార్డుకు తరలింప
జేసీ. /2/
స్వచ్ఛ మనసుతో వున్నా
నిజమైన స్వచ్ఛ సైనికులు
అన్నా, మీరంతా. /గాంధీ
^^ ^^ ^^
5. వూరందం చూడు మామయ్యో
.....
పల్లవి: వూరందం చూడు మావయ్యో
మన వూరందం చూడర
మావయ్యో
తళతళ మెరిసే దారులు
చూడు
దారులు పక్కన మొక్కలు
చూడు
మొక్కల పూల గుత్తులు
చూడు
స్వచ్ఛ సైనికుల శ్రమలో
ఒదిగిన సుందర చల్లపల్లిని
చూడు. /వూరందం/
చరణం: ఆసుపత్రి రహదారిని చూడు
దారిపక్క అందలనుచూడు
పొలిమేరలో నిను
పలకరించే. /2/
కాలేజీ ముందు పూదోటను
చూడు. /వూరందం/
చరణం: ప్రయాణీకుల ప్రాంగణము
చూడు
బలెగున్న బైపాసును
చూడు. /2/
చెత్తబండి వచ్చిందోయ్
రమ్మనే. /2/
స్వచ్ఛ రథము ఆ సైరను
చూడు. /వూరందం/
చరణం: జనం చేతిలో సంచినీచూడు
క్యారీబాగులు వద్దనే నేడు
మన వూరి బాగుకై
శ్రామియిస్తున్న. /2/
స్వచ్ఛ సైనికుల కష్టం
చూడు. /వూరందం/
.. .... ... ......
6. ఎవరు ఎవరు ఎవరు
...
పల్లవి: ఎవరు ఎవరు ఎవరు
అంకితమైనది ఎవరు
అరేళ్లనుండి వూరికొఱకు
పాటుబడిందేవరు
పరిశుభ్ర చల్లపల్లీ కొరకు
శ్రమియిస్తుందెవరు
చెత్తలేని రోడ్ల కొఱకు
మురుగునీటి పరుగు కొరకు
మన బస్టాండ్ బాగు కొరకు
బైపాస్ అభివృద్ధి కొఱకు
స్వచ్ఛమైన గాలి కొరకు
శుద్ధమైన నీటి కొఱకు
తెలుగు కొరకు వెలుగు కొరకు
చల్లపల్లీ భవిత కొరకు
పాటుబడిందేవరు
మన పల్లె తల్లి సాక్షిగా
స్వచ్ఛ చల్లపల్లీ సాక్షిగా
నువ్వు గుండెమీద చెయ్యి
వేసి చెప్పవా
డా.డీఆర్కే దంపతులని
చాటవా
నీ అంతరాత్మ ప్రబోధంగా
చెప్పవా
వాళ్ళు స్వచ్ఛ కార్యకర్తలని
చాటవా. /ఎవరు/
చరణం: తెల్లవారుజాము వాళ్లు
నిద్రలేచి సిద్ధమయ్యి
ఎముకలు కొరికే చలిలో
కురుస్తున్న జడివానలో
పలుగు, పార,గొర్రు కత్తి
చీపుళ్ళను చేతబట్టి
రోజుకొక్క ప్రదేశాన్ని
ముందుగానే ఎంచుకొని
స్వచ్ఛ సుందర చల్లపల్లే
మా ధ్యేయమని
రహదారులు, డ్రైనెజులు
భారీ చెత్త ప్రదేశాలు
శుభ్రపరచి సుందరంగా
తీర్చిదిద్దు శ్రామికులు
ఈ వూరికొఱకు సేవజేయు
సాత్వికులు..స్వచ్ఛ
సాధకులు
..అని గుండెమీద చెయ్యి..
* * * *
..సశేషం....
##స్వచ్ఛ గీతాలు##
7. స్వచ్ఛ చల్లపల్లీ కి
పల్లవి: స్వచ్ఛ చల్లపల్లికి వెళ్లివద్దామా
పరిశుభ్ర చల్లపల్లీ నేడు
చూసివద్దామా
దుర్గంధభరిత రహదారులే
గత చల్లపల్లీ చరిత ఆహా
వినాలి మీరు ఆహా ఆహా
వినాలి మీరు స్వచ్ఛ చల్లపల్లీ
చరిత. /స్వచ్ఛ/
చరణం: చెత్తతోటి రోడ్లన్నీ నిండిన
రోజుల్లో
అయ్యో కంపుకొట్టి డ్రైనేజీ
కదలని కాలంలో
ఎవ్వరూ మెదలని రోజుల్లో
గంగులవారిపాలెం రోడ్డు
నుండి మొదలుపెట్టి వాళ్ళు
చల్లపల్లీ లోని ప్రతీ వీధివీధిని
వారి చెమటతో తడిపి ఆహా
పరిశుభ్రపరచి ఆహా ఆహా
పరిశుభ్రపరచి పచ్చదనం తో
నింపే. /స్వచ్ఛ/
చరణం: నాటి పాగోలు, నడకుదురు
రోడ్డు చూడరన్నా.....
నడవాలంటే ముక్కుమూసి
పరుగులెత్తెరన్నా
ఇప్పుడు వెళ్లి చూడరన్నా
చెట్టుపక్క చెట్టు పెంచి
పూల పరిమళాలు పంచి
చూడముచ్చటైన చెట్లు
చల్లగాలి తగిలినట్లు
ఉందిగా చూడు ఆహా
బలే బాగుంది ఆహా ఆహా
బలే బాగుంది స్వచ్ఛ
చల్లపల్లీ అందీ /స్వచ్ఛ/
చరణం: ప్లాస్టిక్ వ్యర్ధాల గుట్ట బైపాస్
నాడూ...
అరే పసుపుపూల సోయగా
లతో నిండే నేడు, ఒకసారి
వచ్చి చూడూ
డ్రైనేజీలల్ల దిగి మురుగు
నంత సాగనంపి
అందమైన బైపాస్ అందించి
న కార్యకర్తల చూడూ ఆహా