News And Events List

విరాళం (26.03.2020)...

  “సూర్యదేవర నాగేశ్వరరావు గారు వారి సతీమణి ప్రమీలాదేవి గారు” ‘మనకోసం మనం’ ట్రుస్టుకి 10,000/- విరాళం ఇచ్చారు.    గతంలో ఇచ్చిన 1,64,000/- రూపాయలతో కలిపి ఇప్పటివరకు వారు 1,74,000/- రూపాయలను ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు.               ఇట్లు డా. దాసరి రామకృష్ణ ప్రసాదు మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి. గురువారం – 26/03/2020....

Read More

స్వచ్చ చల్లపల్లి – కాఫీ కబుర్లు...

          ‘స్వచ్చ చల్లపల్లి’ కార్యక్రమం మొదలైన కొత్తలో 6 గంటలకి కార్యక్రమం ముగిసిన తరువాత అందరం ఇళ్ళకు వెళ్లిపోయేవాళ్లం. కొద్ది రోజుల తరువాత దాసి సీతారామరాజు గారు అప్పుడప్పుడు ‘టీ’ తెప్పించి కార్యకర్తలకు ఇస్తుండేవారు. ఆ కాలంలో ప్రతి బుధవారం విజయవాడ నుండి డా. శివన్నారాయణ గారు వస్తుండేవారు. వారు వచ్చినప్పుడు వాసిరెడ్డి కోటేశ్వరరావు మాష్టారు, రాజేశ్వరి గారితో ఇంట్లో కాఫీ పెట్టించి అందరికీ ఇస్తుండేవారు. కొన్ని వారాల తరువాత అందరికీ ప్రతి రోజు కాఫీ లు ఇవ్వడం మొదలుపెట్టారు.             ‘మాష్టారూ! రోజూ రాజేశ్వరి గారిని ఇబ్బంది పెట్టవద్దు కాఫీ ఏర్పాట్లు నేను చేస్తాను’ అని ఒకరోజు చెప్పాను....

Read More

వృద్ధో రక్షతి రక్షితః...

 [స్వచ్చోద్యమ చల్లపల్లి లో సీనియర్ కార్యకర్తలకు అభినందనం]             ఐదున్నరేళ్లుగా నిర్విఘ్నంగా – అద్భుతంగా కొనసాగుతున్న స్వచ్చ సుందర చల్లపల్లి సుప్రభాత శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని, కార్యకర్తలలో, గ్రామ ప్రజలలో స్ఫూర్తి నింపుతున్న సీనియర్ కార్యకర్తలు వేమూరి అర్జునరావు మాస్టారు, డాక్టర్ దుగ్గిరాల శివ ప్రసాదరావు గారు, డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు, ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారు, ...

Read More

విరాళం (10.03.2020)...

  పాగోలు వాస్తవ్యులు స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త "కంఠంనేని రామ బ్రహ్మ్మం గారు" నేడు తన 69* వ పుట్టినరోజు సందర్భంగా 'స్వచ్చ చల్లపల్లి' కార్యక్రమాల కోసం 'మనకోసం మనం' ట్రస్టుకి 20,000/- చెక్కును విరాళంగా అందచేశారు. వీరు ప్రతి సంవత్సరం మార్చిలో 15 వేలు, సెప్టెంబర్ లో 15 వేల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన 1,70,000/- రూపాయలతో కలిపి ఇప్పటివరకు వారు 1,90,000/- రూపాయలను ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు.    స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున వీరికి జన్మదిన శుభాకాంక్షలు, ధన్యవాదములు.     వారి అభ్యర్ధన : 'పాగోలు రోడ్డు లో సిమెంట్ రోడ్డు వరకు రెండు వైపులా మనం పెట్టిన మొక్కలను రక్షించి, కలుపు తీసి మనందరం కలిసి ఆ రోడ్డును సుందరంగా నిర్వహిద్దాం. పాగోలు వాస్తవ్యుడనని నేను అడగడం లేదు. ఆ రోడ్డు కూడా మన స్వచ్చ చల్లపల్లి లో భాగమే అనుకొందాం' అని వారు అభ్యర్ధించారు.    ...

Read More

సాకారం కాబోతున్న స్వచ్చ చల్లపల్లి లక్ష్యం...

మనం స్వచ్చ చల్లపల్లి ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు మొట్టమొదట మనం లక్ష్యంగా పెట్టుకుంది -- గ్రామ పరిశుభ్రత - గ్రామ ప్రజలందరూ ఇంటిలోని చెత్తని తడిచెత్త, పొడి చెత్త విడివిడిగా గ్రామ పంచాయితీ కి అందజేయాలని - ఒక్క చాక్లెట్ కాగితం పారేయాలన్నా ఇది డంపింగ్ యార్డు దాకా చేరుతోందా లేదా అక్కడ Solid waste management సరిగ్గా జరుగుతోందా లేదా అనే స్పృహను కలగజేయడం . - ఈ తడిచెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరించే బాధ్యత గ్రామ పంచాయితీది . - గ్రామ పంచాయితీ ఆధ్...

Read More

గుత్తికొండ రామారావు గారి విరాళం (04.03.2020)...

  చినకళ్లేపల్లి వాస్తవ్యులు 'గుత్తికొండ రామారావు' గారు ఒక ధాన్యపు బస్తా విలువైన 1370/- రూపాయలను స్వచ్చ కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం ఇచ్చారు.     గత సంవత్సరం కూడా వారు ఇలానే 1300/- రూపాయలు విరళంగా ఇచ్చారు.    వీరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.   డా. దాసరి రామకృష్ణ ప్రసాదు 04.03.2020...

Read More

దేసు మాధురి గారి తాత గారి విరాళం (03.03.2020)...

 స్వచ్చ చల్లపల్లి కార్యకర్త దేసు మాధురి గారి తాత గారు కొనకళ్ళ మల్లిఖార్జునరావు గారు (91 సంవత్సరాలు) ఇటీవలె మరణించిన తన భార్య శ్రీమతి 'కొనకళ్ళ కమలాదేవి'(84 సంవత్సరాలు) గారి జ్ఞాపకార్ధం 3,000 రూపాయలను స్వచ్చ చల్లపల్లి కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం అందించారు. కార్యకర్తలందరి తరపున వీరికి ధన్యవాదములు. దాసరి రామకృష్ణ ప్రసాదు చల్లపల్లి - 03.03.2020....

Read More

దాసరి వెంకట రమణ గారి లక్ష రూపాయల విరాళం (02.03.2020)...

 స్వచ్చ చల్లపల్లి కోసం మనకోసం మనం ట్రస్టు కు దాసరి వెంకట రమణ గారి లక్ష రూపాయల విరాళం   రామానగరం కు చెందిన దాసరి వేంకట రమణ గారు తమ కుమారుడు “అను దీప్” వివాహం మార్చ్ 5 వ తేదీన జరగబోవు సందర్భంగా స్వచ్చ చల్లపల్లి కార్యక్రమాల కోసం ‘మనకోసం మనం’ ట్రస్టుకు లక్ష రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు. SRYSP జూనియర్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన రహదారి వనం నిర్మించడం లోనూ, గ్రామంలోని అన్ని రహదారి వనంలను నిర్మించడంలోనూ, బస్ స్టాండ్ న...

Read More

*నిజంగా స్వచ్చంగా ఉన్న యార్లగడ్డ*...

 *నిజంగా స్వచ్చంగా ఉన్న యార్లగడ్డ*              నిన్న ఉదయం పాద యాత్రానంతరం ‘స్వచ్చ చల్లపల్లి’ కార్యకర్తలు యార్లగడ్డ వీధులలో సంచరించారు.             ఒకప్పుడు చల్లపల్లి గంగులవారిపాలెం రోడ్డు వలె బహిరంగ మల విసర్జనతో దుర్గంధ భూయిష్టంగాను, పిచ్చి మొక్కలతోనూ ఉండే  శ్రీ నాగమల్లి కోటేశ్వర ఆలయం వరకు ఉన్న రోడ్డు ఇప్పుడు విశాలంగానూ, శుభ్రంగానూ, పూల మొక్కలతో చూడ ముచ్చటగా ఉందని గతంలో గుడికి వచ్చిన  కొంతమంది కార్యకర్తలు  అభిప్రాయపడ్డారు. ...

Read More