Single use plastic వస్తువులతో నిండిపోతున్న డ్రైన్లు....           08-May-2022

 Single use plastic వస్తువులతో నిండిపోతున్న డ్రైన్లు

ప్రజలు రోజు వారీ వాడే single use plastic వస్తువులలో కొన్ని ఇవి:

1. క్యారీ బ్యాగులు

2. ప్లాస్టిక్ బాటిల్స్( మంచినీళ్ళ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, కొబ్బరి నీళ్ళ బాటిల్స్ వగైరాలు)

3. ప్లాస్టిక్ గ్లాసులు

4. ప్లాస్టిక్ ప్యాకింగ్ కవర్లు

5. ప్లాస్టిక్ స్పూన్లు, ఫోర్క్ లు

6. ఇస్ క్రీమ్ కప్పులు, పెరుగు కప్పులు

7. శుభ, అశుభ కార్యాలకు వేసే ఫ్లెక్సీ లు

8. ఇయర్ బడ్స్

ఇవన్నీ మూతలేని డ్రైన్ల లోనూ, కాలవల లోనూ, రోడ్ల ప్రక్కన పడవేయడం కొంత మందికి ఉన్న అలవాటు.   

దీని వల్ల డ్రైన్లు మూసుకుపోయి మురుగు పారుదల జరుగక అనేక అనర్థాలు వస్తున్నాయి.

పరిష్కారం:

1. ప్రభుత్వం Single use plastic ను Ban చేయాలి.

ఈ జులై 1 వ తేదీ నుండి వీటిని Ban చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గట్టిగా అమలు జరుగుతుందని ఆశిద్దాం.

2.  ప్రజలు స్వచ్చందంగా ఈ Single use plastic ను వాడడం మానివేయాలి.

3. వేడుకలన్నింటిలో ఎక్కడా Single use plastic ను వాడకుండా “హరిత వేడుకలుగా” జరపాలి.

 సామాజిక కార్యకర్తలందరు ముందుగా తాము ఆచరించి మిగిలిన వారికి మార్గదర్శకంగా ఉండాలి.

డా. దాసరి రామ కృష్ణ ప్రసాదు

08.05.2022.