సాకారం కాబోతున్న స్వచ్చ చల్లపల్లి లక్ష్యం....           05-Mar-2020

మనం స్వచ్చ చల్లపల్లి ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు మొట్టమొదట మనం లక్ష్యంగా పెట్టుకుంది -- గ్రామ పరిశుభ్రత

గ్రామ ప్రజలందరూ ఇంటిలోని చెత్తని తడిచెత్త, పొడి చెత్త విడివిడిగా గ్రామ పంచాయితీ కి అందజేయాలని

ఒక్క చాక్లెట్ కాగితం పారేయాలన్నా ఇది డంపింగ్ యార్డు దాకా చేరుతోందా లేదా అక్కడ Solid waste management సరిగ్గా జరుగుతోందా లేదా అనే స్పృహను కలగజేయడం .

ఈ తడిచెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరించే బాధ్యత గ్రామ పంచాయితీది .

గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో జరగాలి . ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంలా ఉండాలి 

దీని కోసం ఒక సాంఘిక ఉద్యమాన్ని  నిర్మించాలనదే మన లక్ష్యం.

ఆ లక్ష్యం ఇప్పుడు స్వచ్చ భారత్  2” లో జరగబోతుందని గవర్నమెంట్ ఈ రోజు ఇచ్చిన ప్రకటనలో ఉన్నది.

మనం అనుకున్న ఈ లక్ష్యం ఇవాళ కాకపోతే కొద్ది రోజులకైనా జరుగుతుంది అనేది   మనకు మొదటి నుండీ ఉన్న నమ్మకం.

ఈరోజు నిజంగా మన ప్రధాన రహదారులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటున్నాయి.

ఇది మనం సుదీర్ఘ కాలంగా పనిచేయడం వలన ,స్వచ్చభారత్ కార్యక్రమమ్ అవడంవలన గ్రామ పంచాయితీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం సాధ్యపడింది.

180 వ రోజు అనుకుంటా నేను, సతీష్ చల్లపల్లి ప్రధాన వీధులను  2, 3 నిమిషాల వీడియో తీశాము.

అత్యంత పరిశుభ్రంగా పున్న చల్లపల్లి వీధులవి .

ఎందుకంటే రాత్రి పూట 9 గంటల నుండి 10.30 వరకు స్వచ్చ చల్లపల్లికార్యకర్తలు ముఖ్యంగా యువ కార్యకర్తలు అందరూ కలిసి ఒక ట్రాక్టర్ అద్దెకు తీసుకొని ,లేదా మిత్రులు దగర తీసుకొనో మొత్తం రోడ్లన్నీ కూడా ఊడ్చే వారు.

అందుకే ప్రొద్దున్నే చాలా బాగుండేవి. ఈరోజు మన రోడ్లు నిజంగా మనం శుభ్రం చేయకుండానే, చెత్త లేకుండా ఉంటున్నాయి. దుమ్ము మనం ఊడుస్తున్నాం.

వార్డులలో చెత్త ఇంకా అక్కడక్కడ పోగులు పెట్టడం అనేది చూస్తూనే ఉన్నాం.

ప్రధాన రహదారులు మాత్రం శుభ్రంగా ఉన్నాయి.

ఇదే విధంగా ఇక నుండి అది కూడా లేకుండా ఖచ్చితంగా ప్రతి ఇంటి నుండి తడిచెత్త, పొడి చెత్త సేకరించవలసిన బాధ్యత పంచాయితీదే .

ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం .

దీనిని మనం Social Preasure ద్వారా జరిగేటట్లు చూద్దాము .

పై నుంచి officials ఎలాగూ వత్తిడి తీసుకొస్తారు.

- దాసరి రామకృష్ణ ప్రసాదు

చల్లపల్లి

05.03.2020