స్వచ్చ కార్యకర్తలకు మనవి ....           09-Apr-2020

 స్వచ్చ కార్యకర్తలకు మనవి - 'ఒక్క అడుగు వెనక్కి వేద్దాం!' 

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులపై వ్యతిరేక ప్రచారాన్ని తాత్కాలికంగా ఆపుదాం.

          'కరోనా' వైరస్ వ్యాప్తి వలన వచ్చిన ప్రస్తుత 'లాక్ డౌన్' గడ్డు పరిస్థితిలో అనేక మందికి ముఖ్యంగా శ్రామిక వర్గ ప్రజలకు రోజు వారీ కూరగాయలను, పచారీ వస్తువులను కొనుక్కోవడం కష్టంగా మారింది. పనులు లేక, డబ్బులు లేక ఆకలితో అలమటించే పరిస్ధితి ఇది.

          ఈ సమయంలో ప్రభుత్వ సాయమే కాక అనేక మంది వ్యక్తిగతంగానూ, రకరకాల సంస్థల ద్వారానూ ప్రజలకు నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం.

          ఈ సందర్భంలో వారు క్యారీ బ్యాగులలో సరుకులను ఇవ్వడం జరుగుతోంది. ఇది తప్పనిసరి పరిస్థితి. గుడ్డ సంచులలో ఇవ్వడం ప్రస్తుతం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కనుక ఈ సమయంలో క్యారీ బ్యాగు వాడవద్దు అని ఎవరికీ చెప్పడం మంచిది కాదు. అందరి ఆకలి తీర్చడం మన ముందున్న తక్షణ కర్తవ్యం.

ప్రస్తుతం -

          ఆకలి - పెద్ద సమస్య

          సింగిల్ యూజ్ ప్లాస్టిక్ - చిన్న సమస్య

          అందుకే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారాన్ని కొద్ది రోజులు ఆపుదాం. పరిస్థితులు మామూలుకు వచ్చిన తరువాత మళ్ళీ మన ప్రచారాన్ని మొదలు పెడదాం.

దాసరి రామకృష్ణ ప్రసాదు

చల్లపల్లి

09.04.2020.