భారతలక్ష్మీ రైస్ మిల్ రోడ్డు నాడు - నేడు....           26-Nov-2020

 భారతలక్ష్మీ రైస్ మిల్ రోడ్డు నాడు - నేడు

పబ్లిక్ టాయిలెట్ గా ఉండే భారత లక్ష్మీ రైస్ మిల్ రోడ్డును వాసిరెడ్డి కోటేశ్వరరావు మాష్టారి కృషితో బహిరంగ మలవిసర్జన ఆగిపోయింది. వారే అక్కడ చక్కటి రహదారి వనాన్ని ఏర్పాటుచేశారు. వారి తరువాత స్వచ్చ కార్యకర్తలు, మనకోసం మనం ట్రస్టు ఆ వనాన్ని నిర్వహిస్తున్నారు.

పంచాయితీ వారు చక్కటి సిమెంట్ రోడ్డు వేశారు.

గతంలో ఆ రోడ్డులో వెళ్ళడానికే ఇబ్బంది పడిన గ్రామస్తులు ఇప్పుడు సంతోషంగా ప్రయాణిస్తున్నారు. కాకపోతే రోడ్డుకు ఇరువైపులా బరంతు లేకపోవడం వలన ఎదురుబొదురుగా వాహనాలు వస్తే తప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది.

స్వచ్చకార్యకర్తలు ఇది గమనించి గత కొద్ది రోజులుగా బందరు రోడ్డుపై తాము చేస్తున్న స్వచ్చ కార్యక్రమంలో వచ్చిన మట్టి, ఇసుకను భారత లక్ష్మీ రైస్ మిల్ రోడ్డు మధ్య భాగంలో అటు ఇటు బరంతుగా పోశారు. నిన్న బందరు రోడ్డులోని డ్రైనేజి మట్టిని పంచాయితీ వారు కూడా అక్కడే సర్దారు. ఇది ప్రయాణికులుగా చాలా వెసులుబాటు కనిపిస్తున్నది.

స్వచ్చ కార్యకర్తలకు అభినందనలు.      

- దాసరి రామకృష్ణ ప్రసాదు

   26.11.2020.