గ్రామ సేవలో 6 సంవత్సరాలు నిండిన ‘మనకోసం మనం’ ట్రస్టు. ....           01-Jul-2021

 గ్రామ సేవలో 6 సంవత్సరాలు నిండిన ‘మనకోసం మనం’ ట్రస్టు.

 

డాక్టర్ గురవారెడ్డి గారి చొరవతో స్వచ్చ సుందర చల్లపల్లి లక్ష్యంతో 2015 జులై 1వ తేదీన ‘మనకోసం మనం’ ట్రస్టు స్టాపించబడినది.
RTC బస్టాండు నవీకరణ,
చిల్లలవాగు వద్ద గల శ్మశానాన్ని అభివృద్ధి చేసి నిర్వహించడం,
NTR పార్కులో, నాగాయలంక రోడ్డులో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి, నిర్వహించడం,
బహిరంగ మల విసర్జనరహితంగా గ్రామంగా చల్లపల్లిని తయారుచేయడానికి 70 వ్యక్తిగత మరుగు దొడ్లను కట్టించి, 268 టాయిలెట్లకు ఆర్ధిక సహకారాన్ని అందించడం,
విజయవాడ రోడ్డు, నడకుదురు రోడ్డు, పాగోలు రోడ్డు, నాగాయలంక రోడ్డు, శివరామపురం రోడ్డు, గంగులవారిపాలెం రోడ్డులలో స్వచ్చ కార్యకర్తలు నాటిన వేలాది మొక్కలను, రహదారి వనాలను, తోటలను సంరక్షించడం ‘మనకోసం మనం ట్రస్టు’ నిర్వహిస్తోంది.
ట్రస్టు నిర్వహణకు సహకరిస్తున్న గ్రామ పంచాయతీకి, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, గ్రామస్తులకు, స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలకు, ట్రస్టు కార్మికులకు, డాక్టర్ గురవారెడ్డి గారితో సహ దాతలందరికీ ధన్యవాదములు.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ,
డా. టి. పద్మావతి
కార్యదర్శి,
మనకోసం మనం ట్రస్టు,
చల్లపల్లి,
01.07.2021.