- “ఫ్లెక్సీషేమ్” ఉద్యమాన్ని బలపరచండి.....           18-Sep-2021

 చల్లపల్లి ప్రజలకు విజ్ఞప్తి!

 

- “ఫ్లెక్సీషేమ్” ఉద్యమాన్ని బలపరచండి.

 

            ప్లాస్టిక్ నీళ్ళ సీసా భూమిలో కరగడానికి 400 సం పడుతుంది. ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులేవీ వాడవద్దని అనేక దేశాలు నిషేధించాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే జూన్ నుండి ఈ నిషేధాన్ని అమలు పరచబోతోంది.

 

            ఒక చిన్న ప్లాస్టిక్ సీసా భూమికి ఎంత భారమో తెలిసిన తర్వాత ఈ వేలాది - లక్షలాది ఫ్లెక్సీ బ్యానర్లు పర్యావరణానికి ఎంత ప్రమాదమో చెప్పనలవి కాదు.

 

            అందుకే స్వీడన్ బాలిక గ్రేటా ధన్ బర్గ్ మొదలుపెట్టిన ఫ్లైట్ షేమ్ ఉద్యమ స్ఫూర్తితో - “స్వచ్ఛ సుందర చల్లపల్లి” ఉద్యమంలో భాగంగా ఈ “ఫ్లెక్సీషేమ్” (మానవ మనుగడకు ప్రమాదకరమైన ఫ్లెక్సీలను పెట్టేందుకు నేను చాలా సిగ్గు పడతాను)

ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగింది.   

 

మనం చూస్తూనే ఉన్నాం గదా -        

- రకరకాల పండుగలప్పుడు,

- రాజకీయ నాయకుల, ప్రముఖుల, సినీ నటుల పుట్టిన రోజుల సందర్భంగా,

- వివాహాది వేడుకలలోనూ,

- మరణాలను తెలుపుటకు,

- సినిమాల విడుదలప్పుడు,

- కొత్త వ్యాపార సంస్థల ప్రారంభ ప్రచారాలలోనూ,

- ప్రభుత్వ కార్యక్రమాలలోనూ

ఈ ఫ్లెక్సీలు వేయించడం జరుగుతోంది.

 

వీటికి బదులు పర్యావరణానికి హాని చేయని “గుడ్డ బ్యానర్లు” రాయించలేమా?

 

“ఫ్లెక్సీ బ్యానర్లను వేయించే ఈ ప్రమాదకర సంస్కృతికి దయ చేసి ఫుల్ స్టాప్ పెట్టి, గుడ్డ బ్యానర్లను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలోని మిగిలిన గ్రామాలకు మనం ఆదర్శంగా ఉందామని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.”

 

ఇట్లు

 

దాసరి రామకృష్ణ ప్రసాదు

(స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల తరపున)

18.09.2021.