స్మృతిపథంలో ఒక మేటి సమాజసేవకుడు!....           05-Jan-2022

 స్మృతిపథంలో ఒక మేటి సమాజసేవకుడు!

 

(5-1-19 నాడు కీర్తి శేషుడైన వాసిరెడ్డి వారి తృతీయ వర్ధంతి నాడు రాజేశ్వరి గారి 20 వేల విరాళ సందర్భంగా ఒక నివాళి!)
 
అతడొక బహుముఖ సేవా వినతుడు
గ్రామ వీధుల్లో వందల హరిత వృక్ష శోభకు కారకుడు
విశ్రాంత ఉద్యోగే గాని – పుష్కర కాలం అవిశ్రాంత సామాజిక సేవకుడు
తన ఊళ్లో కనీసం ఒక్క వార్డులో సంపూర్ణ స్వచ్చ – సౌందర్య సాధకుడు
భారత లక్ష్మి రైస్ మిల్లు వీధి ఉద్యాన కర్త!
చల్లపల్లి గ్రామ వీధుల నామ ఫలక ప్రదాత !
పంకం నుండి పద్మాలు పుట్టినట్లు
ఈ అశోక్ నగర్ వీధి అందాలు ఆతని కష్టార్జితాలు
అతని శ్రమ – ధన త్యాగాలతో వెలుగొందినవి హాస్టల్ చిన్నారుల జీవితాలు
కో.వా. గుప్త దానాలు, శక్తి సామర్థ్యాలు వర్ణించాలంటే - శక్తిలేని నామాటలు చాలవు!
మూడేళ్లనాడు కనుమరుగైన అతడే వాసిరెడ్డి కోటేశ్వరరావు!
(ఇప్పటి 20 వేలతో సహా గ్రామాభివృద్ధి కోసం కోటేశ్వరరావు గారి కుటుంబం ఇచ్చిన విరాళం మొత్తం 1,45,000/-)
 
- నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యుడు
05.01.2022.