“ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు” ఇస్తే ఏం చెయ్యాలి?....           06-Feb-2020

 వేడుకల భోజనాలలో ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు ఇస్తే ఏం చెయ్యాలి?

          ప్లాస్టిక్ గ్లాసులను వాడకుండా ఉండడానికి వేడుకలలో జరిగే భోజనాలకు మనతో పాటు స్టీలు గ్లాసు తీసుకెళ్ళడం మంచిదనే అభిప్రాయాన్ని గతంలో వ్యక్తపరిచాను. అయితే మిత్రులకు ఒక అనుమానం వచ్చింది. భోజనాలలో గ్లాసులు ఇవ్వకుండా ప్లాస్టిక్ బాటిల్సే పెడితే ఏం చెయ్యాలి అని.

          మనతో పాటు స్టీలు పళ్ళెం, స్టీలు గ్లాసు, స్టీలు నీళ్ళ సీసా కూడా తీసుకువెళ్దాం.

          - ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు పెడితే మనం తీసుకెళ్లిన స్టీలు సీసా వాడవచ్చు.

          - ప్లాస్టిక్ గ్లాసు ఇస్తే మన స్టీలు గ్లాసు వాడుకోవచ్చు.

          - తగరం విస్తరాకులు గానీ, ప్లాస్టిక్ కోటింగ్ విస్తరాకులు గానీ, ధర్మోకోల్ విస్తరాకులు గానీ పెడితే మన స్టీలు పళ్ళెం తీయవచ్చు. 

          వీటన్నింటినీ ఒక జనపనార సంచి (Jute Bag) లో తీసుకువెళ్ళడం బాగుంటుంది.  

          పర్యావరణహితం కోసం మరిన్ని సలహాలు ఇవ్వవలసిందిగా మిత్రులకు మనవి. 

          ఇటీవల బందరులో కూచిభొట్ల ఆనంద్ గారు, విజయవాడలో డా. కొడాలి జగన్మోహనరావు - శ్రీలక్ష్మి గార్లు తమ కుమారుల వివాహ వేడుకలన్నింటిలో స్టీలు పళ్ళాలు, స్టీలు గ్లాసులు మాత్రమే వాడడం తెలిసిందే. అందరూ వారిని అనుసరించడం అభిలషణీయం.     

(ఒక ప్లాస్టిక్ సీసా భూమిలో కరగడానికి 450 సంవత్సరాలు పడుతుంది కదా - అందుకే మనమందరం వాటికి దూరంగా ఉందాం. ఇప్పటికే మన దగ్గర ఉన్న pet బాటిల్స్ వాడి అవి పాడైపోయిన తరువాత ఇక కొత్త pet బాటిల్స్ కొనవద్దు. స్టీలు లేదా రాగి బాటిల్స్ కొందాం.)

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

చల్లపల్లి  - 06.02.2020.