2866* వ రోజు ....           28-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

రెస్క్యూ టీం చేష్టలు ఈసారి శివరాంపురంలో- @2866*

            సోమ, మంగళవారాల్ని చాల రోజుల్నుండి తమ ఖాతాలో వేసుకున్న నలుగురైదుగురారేడుగురు స్వచ్ఛ కార్యకర్తల - ఇప్పటికీ కొందరు ప్రజలకు సరిగా అర్థం కాని చేష్టలు ఈ - 28.8.23 వేకువ ప్రాత శివరాంపురంలో 4.30 - 6.10 నడుమ నెలకొన్నవి!

ఖచ్చితంగా స్థలమైతే  - ‘BDR’ అని క్లప్తంగా పిలవబడే బాల దుర్గా రాంప్రసాదుని ఇంటి వద్ద! తొలి కార్యకర్తలైదుగురు, సందడి - అతిధి కార్యకర్తలారుగురు - మొత్తం 11 మంది కిందులో ప్రమేయమున్నది!

ఎత్తుగాను, ఒత్తుగాను, అదుపు తప్పి పెరిగిన రెండు చెట్లే కదంబమూ, ఏడాకుల వృక్షాలే నేటి శ్రమదాన కారణాలు! ఇందుకోసమే సుమారు నాలుగు కిలోమీటర్ల వేకువ కాల ప్రయాణం చేసి, గంటన్నరపాటు కార్యకర్తల దైహిక శ్రమ విన్యాసాలు!

పల్లెటూరు గనుక కొందరు మేల్కొనే ఉంటారు గాని, ‘ఎవరీ పొరుగూరి మనుషులు - ఏమిటీ వీధి శుభ్ర - సౌందర్య కృషిఅని ఆరాతీసి, పనిలో వ్రేలు పెట్టడమేమీ జరగలేదు!

అతిధి కార్యకర్తలు వచ్చి చేరాక - మన ఊరి రక్తదాన మహావీరుడు - కస్తూరి విజయుడు ముమ్మారు వడివడిగా విన్పించిన గ్రామ శుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలతో నేటి రెస్క్యూ కార్యకర్తల కార్యక్రమం ముగిసింది!

            ఆలస్యమ్ అమృతమ్ విషమ్

ఆలోలములలోచన - లాకర్షణ చెడు వైపుకు

సామూహిక బాధ్యతలకు సాహసించు వారి కొరకు

మన వంతుగ సహకారం మాత్రం కొరవడెనెందుకు?

ఆలస్యమ్ అమృతమ్ విషమ్అని పెద్దలు అని రెండుకు?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   28.08.2023.