2934* వ రోజు ......... ....           07-Nov-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!

రెస్క్యూ కార్యకర్తలదే 2934* వ శ్రమదానం!

            మంగళవారం వేకువ సైతం 5+3 మంది హరితీకరణ సేవలు బందరు జాతీయరహదారికి దక్షిణంగా 4.25 నుండి 6. 15 దాక లభించాయి! అంతకుముందు వాన పడినా, పని వేళమాత్రం వదిలిపెట్టింది.

            ఐనా అక్కడ తడి, కాళ్ళు జారుడుతో జాగ్రత్తగా పని జరిగింది. ఆ నలుగురైదుగురి పనిపాటుల్లో ముగ్గురు పెద్దల సహకారం.

            ఈ వేకువ సమయాన నాటింది 12 మొక్కలు. బహుశా ఈ సరిక్రొత్త జాతీయ ఉపదారిలో - ఈ 1700 కు పైగా మొక్కలతో - 2.2 కిలోమీటర్ల దారికి రెండు ప్రక్కలా పెద్ద వృక్షాల పచ్చదనానికీ, చిన్న - పెద్ద పూల మొక్కల పుష్ప సంపదకీ ప్రారంభోత్సవం జరిగిందన్నమాట!

            ఇప్పటికిప్పుడు చూసినా కొన్ని మొక్కల పూలు వచ్చే పోయేవారిని చిరునవ్వుల్తో పలకరిస్తూనే ఉన్నాయి! మరో 7-8 నెలల తర్వాత ఈ రహదారి భాగంలో వెల్లివిరిసే హరిత పుష్ప పైభవానికా నవ్వుల పువ్వులు సూచికలన్న మాట! గత నాలుగైదు నెలలుగా శ్రమదానంలో పాల్గొన్న కార్యకర్తలకూ, గ్రామస్తులకూ మరికొన్ని నెలల పిదప ఈ రహదారి ప్రతిదిన సందర్శకం కాబోతున్నది!

      సోమిశెట్టి రాఘవేంద్రరావు, ఫణి కుమారి గార్ల జంట పుత్రులు రుత్విక్ రాఘవ హరణ్, రుషిక్ రాఘవ హరణ్ ల జన్మదిన సందర్భంగా తమ స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తంగా ఇచ్చిన  2,000/- విరాళానికి స్వచ్ఛ కార్యకర్తలు ధన్యవాదాలు చెప్పుచున్నారు. బాలురకు ఆశీస్సులు.

            కేసరపల్లిలో అమ్మ వృద్ధాశ్రమంనిర్వహిస్తున్న శ్రీమతి చెరుకూరి షీల గారు స్వచ్చోద్యమం కోసం 10,000/- విరాళాన్ని అందజేశారు. వీరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు. 

            నేటి శ్రమదానానంతర ఉద్యమ నినాదకర్త కస్తూరి శ్రీనివాసుడు.

            బుధవారం నాటి మన కలయిక ప్రదేశం బెజవాడ రోడ్డులో విజయా కాన్వెంట్ దగ్గరే!

            వినుతించిరొ గణుతించిరొ

ఎందరు సందర్శించిరొ వినుతించిరి గణుతించిరొ

తమ గ్రామాల్లో సైతం శ్రమదానం మొదలెట్టిరొ

అందు సగం మందైనా అది కొనసాగించిన చాలును

చల్లపల్లి శ్రమ వేడుక సార్థకమను కొందును!

- నల్లూరి రామారావు,

   07 .11.2023.

కేసరపల్లిలో “అమ్మ వృద్ధాశ్రమం” నిర్వహిస్తున్న శ్రీమతి చెరుకూరి షీల గారు స్వచ్చోద్యమం కోసం 10,000/- విరాళాన్ని అందజేశారు. వీరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.
సోమిశెట్టి రాఘవేంద్రరావు, ఫణి కుమారి గార్ల జంట పుత్రులు రుత్విక్ రాఘవ హరణ్, రుషిక్ రాఘవ హరణ్ ల జన్మదిన సందర్భంగా తమ స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తంగా ఇచ్చిన 2,000/- విరాళానికి స్వచ్ఛ కార్యకర్తలు ధన్యవాదాలు చెప్పుచున్నారు. బాలురకు ఆశీస్సులు.