2292* వ రోజు.......           06-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

గ్రామ ప్రధాన వీధి గుంటల పూడికలో...@2292* రోజు.

            మూడు రోజుల - 1300/1400 కిలోమీటర్ల కన్నడ దేశ పరామర్శక – వినోద విహారయాత్ర ముగించి 20 గంటలైనా కాలేదు. ఆరుగురు కార్యకర్తలు సోమవారం వేకువనే ఒక టాటాఏస్ వాహనంతో బెజవాడ రహదారిలో వెదకుతూ తారు పెచ్చుల్ని, రాతి ముక్కల్ని సేకరిస్తున్న దృశ్యం. ట్రక్కులో కెక్కించి, విజయవాడ బాట – కోట మలుపులోను, హీరో షోరూమ్ ఎదురుగాను రెండు గుంటల్ని పూడ్చి, చక్కబెట్టేందుకు గంటన్నర సమయదానం!

            రెస్క్యూటీమ్అనబడే ఈ కార్యకర్తలకివన్నీ నిత్యకృత్యాలే కావచ్చు,

సదరు రోడ్ల గోతులెన్ని వాహనాలకు ప్రామాదికంగాను, చూసేందుక సహ్యంగాను, వాహన చోదకులకు మహాచిరాకుగా. శిరోవేదనగా ఉండడాన్ని ఆ బాధ్యతా మూర్తులు తట్టుకోలేకనే ఇవన్నీ చేస్తుండవచ్చు – గ్రామ సామాజిక సాదరులకు నా విన్నపమేమంటే:

            అందరు గ్రామస్తులకూ ఈ కార్యకర్తలంత అభినివేశం, ఊరి మేలు కోసం ఉడుంపట్టూ ఉండకపోతేపోయె - గ్రామ వీధుల స్వచ్ఛ - శుభ్ర - సౌందర్యాలను అనాలోచితంగా భంగపరచకున్నా చాలు - అదే పది వేలు!

            నేటి పని ముగిశాక నిత్య నూతన ప్రణాళికా బద్ధ గ్రామ మెరుగుదల కోసం ముమ్మారు నినదించినది మాలెంపాటి అంజయ్య మహోదయుడు!

      సాహో! రెస్క్యూ దళమా!

కన్నడ సీమన ఎగసిన నిన్నటి స్వచ్ఛ పతాకం

ఈ వేకువ చల్లపల్లి వీధుల్లో ఎగరడం

గ్రామ భద్రతా వీరుల చెమట లిట్లు చిందడం

చల్లపల్లి స్వచ్చోద్యమ సంస్కృతికొక నిదర్శనం!

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

06.12.2021.