2427* వ రోజు.....           03-May-2022

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు.

గ్రామ సుందర - స్వచ్చోద్యమంలో ఇది 2427* వ కెరటం

          ది. 03.05.2022 (మంగళవారం) నాటి శ్రమ కోసం ఉషోదయన ఊరి చివర ఉన్న తరిగోపుల ప్రాంగణం వద్ద కలుసుకుని డంపింగ్ కేంద్రంలో నిన్నటి వలెనే 4.27 కు రెస్క్యూ దళ వీరులు ముగ్గురు, మరో ఇద్దరు స్వచ్చ కార్యకర్తల సహాయంతో (3+2 = 5) దహన వాటికల దగ్గర వీడ్కోలు తదితర వాహనాల పార్కింగ్ స్తలం వద్ద గుంటగా పడి ఉండడాన్ని గమనించి అంతకముందు సమకూర్చుకున్న తారుపెచ్చులను ట్రాక్టర్లో లోడింగ్ చేసుకుని ఆ గుంతలను పూడ్చడం జరిగింది.

          ఈ ఐదుగురి నేటి లక్ష్యం నెరవేరాక - గ్రామ స్వచ్ఛ పరిశుభ్ర - సౌందర్య నినాదాలను ప్రకటించినది మలెంపాటి గోపాలకృష్ణయ్య గారు!

          రేపటి మన చల్లపల్లి సేవ సంతలో!

 

- దాసరి రామకృష్ణ ప్రసాదు

   స్వచ్చ చల్లపల్లి కార్యకర్త

   03.05.2022