2430* వ రోజు....           06-May-2022

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు.

 

శుక్రవారం(06.05.2022) 2430* వ రోజు నాటి శ్రమదాన వేడుక!

 

 వేకువ 4.14 కే 12 మందికి తోడుగా 16 మంది కార్యకర్తలు మొత్తం 28 మంది తమ కర్తవ్య దీక్షను క్రితం రోజు పని ముగించిన చోట మొదలు పెట్టి, పిచ్చి మొక్కలను, రాళ్ల మధ్యలో అస్తవ్యస్తంగా మొలిచిన, బాగా పెరిగిన గడ్డిని తొలగించుటకు కత్తులకు పూర్తిగా పని చెప్పవలసి వచ్చినది.

 

కోసిన గడ్డిని మహిళా కార్యకర్తలు ఎప్పటిది అప్పుడే శేషం లేకుండా గంపలలోకి ఎత్తి ట్రాక్టర్ లో లోడు చేసినారు.  

 

ఎత్తిన గంపలు చేతికందుకొని ట్రాక్టర్ పై నుండి ఒక బాల కార్యకర్త లోడింగ్ బాధ్యతలను నిర్వర్తించడం మనం కనులారా చూసి తీరవలసినదే!

 

2 గంటల పాటు ఉక్కపోతను సైతం లెక్క చేయక సంత  ప్రాంగణం పరిశుభ్రత కోసం స్వచ్చ కార్యకర్తలు పడిన శ్రమను ఏమని వర్ణించగలరు!

 

6.20 కి కాఫీ సేవనానంతరం గ్రామ స్వచ్చ- శుభ్ర – సౌందర్య నినాదాలను నినదించినది మొక్కల రమణ (తాతినేని వెంకట రమణ)గారు.

 

రేపటి వేకువ కూడ మన స్వచ్చ సేవ సంతలోనే!

 

నందేటి శ్రీనివాస రావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త

06.05.2022.

 

సమర్పిస్తున్నాం ప్రణామం 114

 

కష్టానికి భయపడితే కలుగదు ఏ సౌఖ్యం

ఒంటికి తగు శ్రమ లేనిదె ఒనగూడున ఆరోగ్యం?

శ్రమ మూల మిదం జగత్..చక్కనైన ఒక భాష్యం

ఆ శ్రమ ఊరి పరం చేసిన అందరికీ ప్రణామం!

 

- నల్లూరి రామారావు,

   ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,

   స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త   

   06.05.2022.