2510* వ రోజు.......           18-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం!

సర్కిల్ ఇన్స్పెక్టరు వారి కార్యాలయ ప్రాంగణంలో 49 మంది శ్రమదానం – 2510*

          పోలీస్ వారి ఆత్మీయ ఆహ్వాహనం మేరకు ఉభయ కార్యకర్తల 4.16 - 6.20 వేళల నడుమ జరిగిన ఆదర్శ శ్రమదానంతో - రెండు ట్రక్కుల వివిధ కశ్మలాల తొలగింపు జరిగి, సదరు రక్షక భటనిలయం కనువిందు చేస్తున్నది...

          3 - 4 పోలీస్ స్టేషన్ల వారు చూపిన ఉత్సాహం, స్వచ్చ కార్యకర్తలతో వారి కృషి సమన్వయం, మమేకం, ముఖ్యంగా చల్లపల్లి స్వచ్చోద్యమం పట్ల B. భీమేశ్వర కుమార్ గారి హృదయా విష్కరణం ప్రశంసనీయంగా ఉన్నవి!

          6.25 సమయంలో DRK గారి యధాపూర్వక సమీక్షతోను, పై పోలీసు అధికారే ముమ్మారు కీర్తించిన చల్లపల్లి స్వచ్చ - శుభ్ర - సౌందర్య - హరిత సంకల్ప నినాదాలతోను నేటి శ్రమదాన కర్తవ్యం ముగింపు!

          రేపటి మన శేష బాధ్యతలు బెజవాడ బాటలోని చిల్లలవాగు వంతెన సమీపంలో ఉండగలవు!

- నల్లూరి రామారావు,

  18.08.2022.