2511* వ రోజు..........           20-Aug-2022

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం!

ఉభయ విద్యాసంస్థల పరిసరాల బాగుచేత - @2511*

          శనివారం నాటి 4.20 - 6.10 నడిమి సమయంలో 27 మంది గ్రామ సామాజిక బాధ్యులు మెరుగుపరచిన వీధి విజయవాడ దారిలోని విజయా, జిల్లా పరిషత్ స్కూళ్ళ ఎదుటే!

          మురుగు కాల్వ ఉభయ గట్లను గడ్డి పీకి, పిచ్చి – ముళ్ల మొక్కల్ని నరికి తొలగించి, ప్లాస్టిక్ ల – ఎండు పుల్లల, ఆకుల వివిధ వ్యర్ధాలను డిప్పల్తో – ట్రాక్టర్ లో నింపి - ఎవరి శక్తి మేరకు వాళ్ళు పాటుబడ్డారు!

          నేడో, రేపో అక్కడ గద్దగోరు లాంటి వీధికి శోభ తెచ్చే పూలమొక్కల్ని – బహుశా ట్రస్టు ఉద్యోగులు నాటనున్నారు.

          ఇటు కార్యకర్తల, ట్రస్టు కార్మికుల, ‘మనకోసం మనంసంస్థ పక్షాన జరిగే నిరంతరాయ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య ప్రయత్నాలొక ఒకవైపు - అటు గ్రామస్తులో, ప్రయాణికులో పట్టు వదలని విక్రమార్కుల్లా తెలిసో తెలియకో వీధి కశ్మల ప్రయత్నం ఒక ప్రక్కా - ఒక మహానేత చెప్పినట్లు – “దిసీజ్ గోయింగ్ టు బి ఎ నిరంతర ప్రక్రియ!”

          నేటి గ్రామ బాధ్యతల ముగింపు వేళ - దైనందిన కృషి సమీక్ష, దానికి ముందు శేషు ముమ్మారు గుర్తుచేసిన చల్లపల్లి స్వచ్చ – శుభ్ర – సౌందర్య సాధకకాంక్షా నినాదాలు, శేషు గాయకుని 3 పాటల్తో...  

- నల్లూరి రామారావు,

  20.08.2022.