2512* వ రోజు....           21-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం!

ప్రభుత్వోన్నత పాఠశాలలో - అదివారం (21.8.222) నాటి శ్రమదానం - @2512*

            వేకువ 4.206.08 కాలం; Z.P. పాఠశాల లోతట్టు భాగం; శ్రమదాతలు 32 మంది; పుట్టుకొచ్చిన అవాంఛిత పదార్దాలు ట్రాక్టర్ నిండుగా; కార్యకర్తల మనః పరితృప్తి మెండుగా....

            ఇదే టూకీగా నేటి వీధి పారిశుధ్య పరిచర్యల సారాంశం! 2512 నాళ్లుగా చల్లపల్లి గ్రామంలో ఈ కథ పునః పునరావృతం! వెనకటి కాశీమజిలీ కధా స్రవంతిలాగా అనంతం! ప్రక్కన పాఠశాల విద్యార్థులకేమో ఈ మైకు పాటలు, పెద్ద డాక్టర్ల, ఇతర పెద్దల - పిన్నల శ్రమానంద పారవశ్వమేమో అయోమయ ప్రశ్నార్ధకం!

            గజం ఎత్తున గుబురుగా పెరిగిన గడ్డి ఏవేవో పనికి రాని మొక్కలూ, వాటి మధ్య చిక్కుకున్న ప్లాస్టిక్ తుక్కులూ, సీసాలూ జాతీయ పతాక రూప శిల్పి పింగళి వేంకయ్య సాక్షిగా - గంటన్నర శ్రమతో అదృశ్యమైన వైనాన్ని ఎందరు గ్రామస్తులు పట్టించుకొని, ప్రశ్నించుకొని, స్పందించారో?

            6.20 పిదప తన గ్రామ స్వచ్చ - శుభ్ర - సౌందర్యలాలసను గట్టిగా ముమ్మారు నినదించినది గోళ్ళ వెంకటరత్నం కాగా, ఆంధ్ర భోజుడు కృష్ణరాయల కళాభిమాన గేయాన్ని (ఆత్రేయ) ఆలపించిన నందేటి గాయకుడు, గున్న మామిడి లాంటి చల్లపల్లి చరిత్రను గానం చేసిన శేషు దారిన పోతూ, ఆగి ఈ 30 మంది తేడాగాళ్లనువింతగా చూస్తూపోతున్న గ్రామ - గ్రామేతర వ్యక్తుల్నీ గమనించాను.

            బుధవారం వేకువ మన శ్రమ కోసం ఎదురుచూస్తున్నది 1 వ వార్డు దగ్గరి హిందూ శ్మశానవాటిక!

- నల్లూరి రామారావు,

   21.08.2022.