1920 * వ రోజు....           13-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1920* వ నాటి శ్రమ విశేషాలు.

 

నేటి వేకువ 4.06 నుండి 6.20 వరకు స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు 25 మంది. బైపాస్ రోడ్డు లోని నారాయణ రావు నగర్ వెళ్లే రోడ్డు నుండి పాల కంపెనీ వరకు రోడ్డు ప్రక్కన, రోడ్డు ప్రక్కన గతంలో స్వచ్చ కార్యకర్తల చే నిర్మించబడిన  తోటల లోని పిచ్చి మొక్కలను నరికి, చెత్తను శుభ్రం చేసి  ట్రాక్టర్ లోకి ఎక్కించి డంపింగ్ యార్డ్ కు తరలించారు. కొంత మంది కార్యకర్తలు రోడ్డు ప్రక్కన ఉన్న ఎత్తు పల్లాలను సరి చేశారు.

మరికొంత మంది కార్యకర్తలు R.T.C బస్ ప్రాంగణంలోని ఒక గోడను సుందరీకరించుచున్న కార్యక్రమాన్ని నేడు కూడా కొనసాగించారు.

 

మెండు శ్రీను, దేసు మాధురి గార్లు చెప్పిన స్వచ్చ సంకల్ప నినాదాలతో నేటి కార్యక్రమం ముగిసింది.

 

అనంతరం ఇటీవలనే బైపాస్ ఆపరేషన్ చేయించుకొని వచ్చిన స్వచ్చ కార్యకర్త అడపా గురవయ్య గారి ఇంటికి వెళ్లి వారిని పలకరించడం జరిగింది.

 

రేపటి మన కార్యక్రమం కోసం బైపాస్ రోడ్డు లోని పాల కంపెనీ వద్ద కలుసుకొందాం.    

 డా. దాసరి రామ కృష్ణ ప్రసాదు  

 స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

మేనేజింగ్ ట్రస్టీ  - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 13/02/2020

చల్లపల్లి.