2577* వ రోజు.........           30-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

శ్రమదాన ప్రస్థానంలో మరొక చిరస్మరణీయ మజిలీ - @2577*

న్ని వేకువల్లాగా కాక - ఈ ఆదివారం(30-10-22) శ్రమసందడి చిరస్మరణీయమైన కారణం బెట్టిదనగా:

1) నేటి కార్యకర్తల - తదితరుల హాజరీ 65 (వీరిలో 45 మంది నికరంగా రహదారి పారిశుద్ధ్య కార్మికులైతే మిగిలినవారు అతిథి అభ్యాగతులూ, కొంత ఆలస్యంగా వచ్చిన వారూ – (ఐతే వీరిలో కాయన (ZPTC) ఒక కార్యర్త చేతిలో కత్తి తీసుకొని ఈత చెట్టును సుందరీకరించడం చూడండి!)

2) సామాజిక చింతనలతోను, రోగుల ప్రాణ రక్షణలతోనూ క్షణం తీరిక ఉండని, దేశదేశాలూ తిరుగుతుండే డాక్టర్లు గురవారెడ్డి, శివన్నారాయణ, భవాని వంటి వ్యక్తులు స్వచ్చోద్యమ చల్లపల్లిని వెదుక్కొంటూ వచ్చి, కార్యకర్తల్ని ఉత్సాహపరచడం;

3) స్వచ్ఛ - సుందరీకరణ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్న, క్రమబద్ధీకరిస్తున్న రి స్వచ్ఛ - సుందర వైద్యుని ఆనంద తన్మయత్వం;

4) 4.20 కి మొదలైన శ్రమదానం 6.00 గంటలకు ఆగినా, 7.20 దాక - అనగా మొత్తం 3 గంటల పాటు - ఐదారుగురు తప్ప ఎవరూ చలించకపోవడం;

5) ప్రస్తుతం భద్రాచల నివాసీ, మోపిదేవికి మాజీ మరియు ప్రస్తుత ZPTC – మెడబలిమి మల్లికార్జునరావు గారు మనకోసం మనం ట్రస్టుకు లక్ష రూపాయల విరాళం;

6) చాల కాలం స్వచ్చోద్యమ కారిణీ, దురదృష్టవశాత్తూ సంవత్సరం క్రితం మృతురాలూ ఐన నారంసెట్టి విజయమ్మ జ్ఞాపకార్థం ఆమె పెనిమిటీ, నయుడూ స్వచ్చోద్యమానికి 10,000/- చెక్కునూ, కార్యకర్తలకు లొక చేసంచీ - తేనె సీసా పంచడం;

          ఇవి కాక - నందేటి గాయకుని శ్రమయజ్ఞ గీతాలాపన, గోపాళం శివుడి గారి కనిపించని రెండో తల్లి (భరతమాత!) పాముఖ్యత, సమాజ దేవాలయంలో స్వచ్చోద్యమకారుల 2577* వేకువల నిత్యార్చన, అసలు మనిషనేవాడెందుకు - ఎలా పుట్టి ఎలా బ్రతకాలినే వివరణా,

          పైన గురవారెడ్డి వాక్రుచ్చిన చల్లపల్లి స్వచ్ఛ సైనికుల ఉడుంపట్టుదలా, తానొక పెద్ద డాక్టరే ఐనా ఎన్నడూ మైకు ముందుకు రాని, తొలిమారు వచ్చి, స్వచ్ఛ కార్యకర్తల్ని అభినందించిన భవనం భవాని గారి కొద్దిపాటి మాటలూ... ఇంకా ఎన్ని విశేషాలైనా ఉన్నవి.

          నిన్న 3.30 నుండి 7.30 దాక (4 గంటలు) సాగిన ఎనిమిదేళ్ల స్వచ్చంద శ్రమదాన సమీక్షా, చాట్రగడ్డ శ్రీనివాస్ బృందం వారి కళాప్రదర్శన, “నా దేశం గత చరిత్ర నెత్తుటి మరకా - ఐతే, నా తల్లి మనస్సు మాత్రం మీగడ తరకావంటి గేయాలాపనా స్వచ్ఛ ప్రేక్షకులు మరచిపోలేనివి!

          “గురవాభిరామం వీధి నామఫలకా విష్కరణలో రెడ్డి గారి ఆశ్చర్యమూ, గుర్తుకొస్తున్నాయి పుస్తక స్వీకార సమయపు DRK గారి కంటి చెమరింపూ.... వీ అసలైన స్వచ్ఛ స్నే లక్షణాలు మరి! నేటి 3 గంటల, నిన్నటి 4 గంటల కార్యకర్తల అనుభూతులూ ఓర్పూ.... అవి మరొకమారు ప్రస్తావనాంశాలు!

          “శ్రమమూల మిదం జగత్అని పదేపదే ఋజువుపరుస్తున్న 30-40-50 మంది వేకువ సమయపు శ్రమదానమే పై సంఘటనల కన్నిటికీ మూలకారణం!

          బుధవారం ఉషోదయాన మన పునర్దర్శనం - కాసానగర్ దగ్గరే!

       అష్టమ వార్షికోత్సవమున....

చిన్న నాటకీయతలూ, చిక్కటి మానవ స్పర్శలు,

కొన్ని కొన్ని గత స్మృతులు, కొంత క్రొత్త దార్శనికత

అలరించే తాత్త్వికతలు, అసలు సిసలు వాస్తవికత

ముమ్మొదటి కళాచతురత, మొలకెత్తిన వదాన్యతా!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   30.10.2022