2591* వ రోజు.... ....           14-Nov-2022

  ప్రత్యేక కార్యకర్తల సోమవారం నాటి శ్రమదానం - @2591*

            కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

            సోమవారం (14.11.2022) అనగా రెస్క్యూ టీం వారి విభిన్న శ్రమదానం అనే గదా!

            ఆనవాయితీ ప్రకారం ఈ వేకువ విజయ్ నగర్ రెండవ వీధిలో ముగ్గురు స్వచ్ఛ శ్రమదాతలు వాళ్ళకు తోడు 83 ఏళ్ల

ఇంకొక స్వచ్ఛ వృద్ధుడు వీధి సేవకు హాజరయ్యారు.

            ఇక వీళ్ళు ఆ ప్రాంతంలో ఉద్ధరించబోయేది ఏమిటయ్యా అంటే – విద్యుత్ డిపార్ట్మెంట్ వారు అక్కడి జనం భద్రత కోసం అనగా చెట్ల కొమ్మలు మితి మీరి పెరిగి విద్యుత్ తీగలను అంటుకొనకుండా చెట్టు కొమ్మల్ని  కాక మొదళ్లనే కసిగా నరికి వేయగా, చిందర వందరగా పడి ఉన్న కాండాలను, కొమ్మలను ముక్కలుగా చేసి ట్రక్కులోకి ఎక్కించి చెత్త కేంద్రానికి చేర్చడమే గదా!

            ఆ పనిని వీళ్ళు సమర్ధవంతంగా నెరవేర్చారు. కస్తూరి శ్రీనివాస్ మూడు మార్లు నినదించిన గ్రామ స్వచ్ఛ సుందర అభిప్రాయం ప్రకటించి నేటికి తమ కర్తవ్యాన్ని ముగించారు.

            రేపటి - మంగళవారం వేకువ మరింత మంది కార్యకర్తల తోడ్పాడుతో అందరం కలిసి శ్రమించవలసిన చోటు విజయవాడ మార్గంలోని గాంధీ విగ్రహం దగ్గరే!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   14.11.2022.