పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!
2802* వ వేకువ కొందరి రెస్క్యూ పనులు.
సోమవారమైనందున – గ్రామ భద్రతా కార్యకర్తల ప్రణాళికననుసరించి – 3+2 మంది ఊరి చివర - అవనిగడ్డ రహదారియందలి బండ్రేవుకోడు కాల్వ అంచుకు చేరుకొనిరి.
అస్తవ్యస్తంగా – పద్ధతీ పాడూ లేకుండ ముణ్ణాలుగు నాళ్ళ క్రితం ఆ వీధిలో పబ్లిక్ టాయిలెట్ల వద్దనూ, వడ్లమర దిశ గానూ విరిగి పడి రాకపోకల నడ్డుకొంటున్న కొమ్మల సంగతి చూడడమే నేటి కార్యకర్తల పూనిక!
మరి - ఈ కర్తవ్యం ఎవరో విధించింది కాదు – తొమ్మిదేళ్ల నాడు ఊరి దుస్థితిని చూసి చూసి, చీకట్లో చిరు దీపం వెలిగించినట్లు – ఇష్ట పూర్వకంగా జనవిజ్ఞానవేదిక కార్యకర్తలు స్వీకరించిన బాధ్యతలు! పైకేదో చిరు సహాయాలుగా అనిపించినా - ఊరి స్వరూపాన్నే మారుస్తున్న నిర్ణయాలివి!
ఈ వేకువ సంగతే గమనించండి - రెండు రోజులుగా ఇబ్బంది పడుతూ – సర్దుకుపోతున్న ప్రయాణికులు గాని, వాహన చోదకులు గాని – తలపెట్టని ఈ బాట మారామత్తుల్ని నెరవేర్చింది అల్ప సంఖ్యాక స్వచ్ఛ కార్యకర్తలే గదా!
కొమ్మల్ని ముక్కలుగా నరుకుడు గాని, మొండిచెట్ల సుందరీకరణం గాని, పెద్ద బండెడు వ్యర్థాల్ని ట్రాక్టర్ లో నింపుకొన్న దృశ్యాల్ని వాట్సప్ లో చూడవచ్చు!
చివరగా - ఉత్సాహంగా వాళ్లు చేసినవి మాలెంపాటి అంజయ్యననుసరించి గ్రామ స్వచ్చోద్యమ నినాదాలు!
రేపటి విస్తృత కార్యకర్తల వేకువ కలయిక - బందరు వీధిలోని రాయపాటి వారి “ట్విల్స్” దుకాణం దగ్గరే!
గుటక గంజి సాటి రావు
ఉపన్యాసములు దేనికి అసలు పనేలేనప్పుడు?
గుడులు, బడులు వందలైన గుటక గంజి సాటి రావు
కార్యకర్త శ్రమదానం గంట పాటు అందుకె గద!
“శ్రమమూల మిదం జగత్” – అది లేనిదె ఏం లాభం?
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,
19.06.2023.