స్వచ్ఛ - సుందరోద్యమంలో నిన్నటి విశేషఘట్టం.....

 స్వచ్ఛ - సుందరోద్యమంలో నిన్నటి విశేషఘట్టం.

            శ్రమదానోద్యమ ముఖ్య ఛాయా గ్రాహకుడైన శంకర శాస్త్రి గారి భవఘ్నినగర్ డ్రైను గట్టుకు దన్నుడుగా సిమెంటు స్తంభం వేశాకఅనే వ్యాఖ్యానం తాలూకు ఫొటోను చూశారా? మనలో చాలమందికి ఏముందక్కడంతగా చూడ్డానికి ఏదో రోడ్డుగుంటొకటి పూడ్చారు, చదును చేశారు అంతేగా...అనిపించవచ్చు.

            అది మూడు నెలల - ఐదారుగురు కార్యకర్తల మూడు నాలుగు విడతల ముమ్మర ప్రయత్నమనీ, అందులో ఊరి ప్రజా ప్రయోజనం తప్ప స్వార్థచింతన లేదనీ, 3017 రోజుల్లో గ్రామ వ్యాప్తంగా స్వచ్ఛ సుందరీకర్తల వందలాది చర్యల్లో ఇదొకటనీ ఏ కొద్ది మందిమో ఈ శ్రమదానానికి గుర్తిస్తాం! గుర్తించిన వాళ్లలోనైనా అతి తక్కువ మందిమే ఈ శ్రమదానాన్ని పూనుకొంటాం!

            తూర్పు ప్రక్క పొలాల, గృహాల మురుగు నీరు డ్రైనులో కలిపే తూము సరిగా లేక - ఒక వంక లోతుగా మురుగు కాల్వ, మరో వంక వీధి మార్జిన్ ఆక్రమణతో రోడ్డు ఇరుకై, గుంటలో వాహనాలు ఒరిగిపోతుంటే - ఆ తూముకు జాయింటు వేసి, క్రింద నుండి ఊరి రద్దును తెచ్చి నింపి, భారీ సిమెంటు స్తంభాన్ని అడ్డుగా సర్ది, అన్నిటి భద్రతగా పెగ్గుల్ని పాతి అక్కడి వీధి పచ్చదనాన్నీ, వాహన క్షేమాన్ని సాధించిన స్వచ్ఛ కార్యకర్తలకు గ్రామస్తుల తరపున అభివందనాలు!

- ఒకానొక స్వచ్ఛ కార్యకర్త

  01.02.2024.