3021*వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

మరొకమారు రెస్క్యూ బృందం వీధిలోకి - @3021*

         సోమవారం (5-2-24) కావున, రెస్క్యూ చర్యల కోసం కాచుక్కూర్చున్న 5 గురు 4.18 కే గస్తీ గది వద్దకు చేరి,

1) గంగులవారిపాలెం వీధి పూలవనాల,

2) అదే వీధి డ్రైను అనుచితమ్మీద కత్తులు దూశారు.

         తొలుత వేరే వీధి నుండి సేకరించిన మట్టిని పూల మొక్కల వద్ద ఒంపి, పాదులకు సర్దారు.

         వీధి సముచిత స్థితి కోసం వాళ్లకి 2 పెద్ద తాడి చెట్ల దుంగలు అవసరం కాగా, 2 న్నర కిలోమీటర్ల దూరస్థ శివరాంపురం రోడ్డుకు వెళ్లడమూ, అక్కడ నలుగురు ఇతర కార్యకర్తలు తోడు రావడమూ,

         ఎవరో పడగొట్టిన తాడి చెట్లక్కడ రహదారి సౌందర్య భంగకరంగా ఉన్నందుననూ, ఆ చెట్లు గంగలవారిపాలెం వీధిలో అవసరపడడం వల్లనూ, పెదప్రోలు పంచాయతీ పరిధిలోని ఆ రెండు చెట్లను అవసరానుగుణంగా కోసి, ట్రక్కులో కెక్కించడమూ జరిగిపోయాయి.

         దగ్గరలో మహా శివరాత్రి పర్వదిన పెదకళ్లేపల్లి సందర్శకులకు కనువిందు చేసేందుకు స్వచ్ఛ కార్యకర్తలు ఈ శివరాంపురం వీధిలోనే పనికి దిగవలసి ఉన్నది.

         గంధం బృందావనుడి త్రివిధ నినాదపూర్వకంగా నేటి శ్రమదాన కార్యక్రమం ముగిసింది.

         స్వాగతిస్తాం - సత్కరిస్తాం!

ఎవరి కొరకో ఎదురు చూడని - ఎవరెవరినో దేబిరించని

ఉన్న ఊరిని కన్న తల్లిగ ఊహలందున నిలుపుకొంటూ

సర్వ శ్రేష్ఠగ తీర్చిదిద్దే సాహసాలను ప్రదర్శించే

స్వచ్ఛ సుందర కార్యకర్తనె స్వాగతిస్తాం - సత్కరిస్తాం!

- నల్లూరి రామారావు

   05.02.2024