సుద్దాల అశోక్ తేజ గారికి రాసిన ఉత్తరం....

సుద్దాల అశోక్ తేజ గారు ఇటీవలే కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్నారు.

 
స్వచ్చ కార్యకర్తల తరపున వారికి ఈ ఉత్తరం రాయడం జరిగింది.

గౌరవనీయులైన అశోక్ తేజ గారికి,
 
నమస్కారములు,
 
మీరు ఆపరేషన్ చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి చాలా సంతోషపడ్డాము. మీరు ఇలాగే ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు గడపి ఎంతో ఉత్తేజకరమైన పాటలు రాయాలని మా అందరి కోరిక.
 
మీరు మా ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమానికి 300 వ రోజున ముఖ్య అతిధిగా వచ్చి చేసిన ప్రసంగం, మా ఉద్యమం పై మీరు రాసిన పాట మేమేప్పటికీ మర్చిపోలేము. మా కార్యకర్తలందరూ మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
 
ఇట్లు
డా. డి.ఆర్.కె. ప్రసాదు
డా. టి. పద్మావతి
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు
చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్,
12.07.2020.
 

కార్యకర్తలను అభినందిస్తూ ఆయన పంపిన సమాధానం

 
మీప్రేమను
Mee ఆతిథ్యాన్ని
ఎన్నడు మరచిపోలేదు
మీ సంకల్ప యజ్ఞము
నాపై ఎంతో ప్రభావం చూపింది డాక్టర్ గారూ
మీకు తోడు మీ సహచరి మేడం గారు
యు అల్ అర్ గ్రేట్ పర్సన్స్

నేను బాగున్నాను
ధన్యవాదాలు
మీ కార్య దక్షులకు స్వచ్ఛ సైనికులకు
నా నమస్కారాలు

ఎప్పటికి మీ కవి
మీ వాడు
 
సుద్దాల ఆశోక్ తేజ