2278* వ రోజు ....

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

బుధవారం - 17-11-21 నాటి (2278) శ్రమదానం. 

 

ఈ వేకువ 4.21 నుండి 6.20 వరకు 22 మంది కార్యకర్తలు గంగులవారిపాలెం రోడ్డుమూల నుండి తూర్పు వైపుకి రోడ్డు కు ఇరువైపులా కలుపు మొక్కలను తీసి శుభ్రపరిచారు. చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించారు.

 

తడి చెత్త , పొడి చెత్త విడివిడిగా సేకరించే విధానాన్ని అమలుపరచడంలో భాగంగా ప్రజలకు వివరించడాన్ని పంచాయితీ వారు ఈ రోజు నుండి మొదలుపెడుతున్నారు.

 

నేటి సాయంత్రం 5.00 కు యడ్ల వారి బజారు వద్ద పంచాయితీ వారితో పాటు స్వచ్చ కార్యకర్తలం కూడా ఏక రూప దుస్తులతో కలుద్దాం.

 

రేపటి వేకువ మన సామాజిక బాధ్యతా నిర్వహణ గంగులవారిపాలెం రోడ్డులోని వంతెన వద్ద కలుసుకుందాం!

 

- దాసరి రామ కృష్ణ ప్రసాదు

17.11.2021.

 

 

ఈ మహా దీక్షలకే ప్రణామం – 48

 

మురుగు కాల్వలు దేవినప్పుడే మీ అహంకృతి మాయమైనది

పేడ - పెంటల నెత్తినప్పుడే స్థిత ప్రజ్ఞలు బైట పడ్డవి

బయలు దారులు, చెత్త కేంద్రం, శ్మశానాలే, పెద్ద ఋజువులు

మీకు గాకింకెవరికయ్యా! మేము చేస్తాం సత్ప్రణామం?